బాలయ్య బర్త్ డే స్పెషల్ : ‘యన్.టి.ఆర్’ మూవీ కొత్త పోస్టర్ అదిరింది
టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన బాలకృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న 'యన్.టి.ఆర్' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రం బాలయ్య తండ్రి, మహానటుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తేజ దర్శకుడిగా తప్పుకోవడంతో ఆ స్థానంలోకి క్రిష్ జాగర్లమూడి వచ్చారు. దర్శకుడు పేరు మారిన తర్వాత విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే.
బాలయ్యను విష్ చేసిన క్రిష్
తన నూరవ చిత్రంలో అమ్మ పేరుని ధరించి కూస్తంత మాతృఋణం తీర్చుకున్న "బసవ రామ తారక పుత్రుడు", ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృఋణాన్ని కూడా తీర్చుకుంటున్న "తారక రామ పుత్రుడు", శతాధిక చిత్ర "నటసింహం", నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు." అంటూ దర్శకుడు క్రిష్ విషెస్ తెలియజేశారు.

ఆకట్టుకుంటున్న యన్టీఆర్ పోస్టర్
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ క్రిష్ ఐడియా మేరకు వినూత్నంగా డిజైన్ చేశారు. యన్టీఆర్ నటించిన వివిధ చిత్రాల్లోని పాత్రలు ఈ పోస్టర్లో ప్రదర్శించారు. బాలకృష్ణకు యన్టీఆర్ మీసాలు దిద్దుతున్న ఫోటోను కూడా ప్రముఖంగా ఫోకస్ చేయడం గమనార్హం.

యన్టీఆర్
వారాహి చలన చిత్రం, యన్‌బికె ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు వర్దన్ ఇందూరి నిర్మాతలు. యం.యం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బిఎస్.జ్ఞానశేఖర్, తోట తరణి, సాయి మాధవ్ బుర్ర, సిరివెన్నెల సీతారామ శాస్త్రి తదితరులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

సంక్రాంతి రిలీజ్
‘యన్టీఆర్' చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే వరుసగా నాలుగో ఏడాది బాలకృష్ణ సినిమా సంక్రాంతికి విడుదలైనట్టు అవుతుంది. డిక్టేటర్, గౌతమిపుత్ర శాతకర్ణి, జై సింహా చిత్రాలు సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే


Click it and Unblock the Notifications











