శ్రీరాముడు,శ్రీకృష్ణుడు,గాంధి మార్గంలో బాలకృష్ణ
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, మహాత్మాగాంధి... ఈ మహనీయుల మార్గాలు వేరైనా లక్ష్యం మాత్రం ధర్మసంస్థాపన. వారిలాగే ఒకే లక్ష్యం, భిన్న మార్గాలు కలిగిన ముగ్గురు మహావ్యక్తుల కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'అధినాయకుడు'. ఇందులో బాలకృష్ణ మూడు పాత్రలూ ఈ ముగ్గరి లక్ష్యాలని,విధానాలని ప్రతిబింబిస్తాయి. ఈ విషయాన్ని అధినాయకుడు నిర్మాత ఎం.ఎల్.కుమార్‌చౌదరి విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలియజేశారు. తాతగా, తండ్రిగా, తనయుడిగా బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్.కుమార్ చౌదరి నిర్మించారు. పరుచూరి మురళి దర్శకత్వం వహించారు. లక్ష్మీరాయ్, సలోని హీరోయిన్లు.
అలాగే ...ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. బాలయ్యబాబు ఇమేజ్‌కి తగ్గట్లుగా సంగీత దర్శకుడు కళ్యాణిమాలిక్ పాటలను స్వరపరిచారు. నిర్మాణానంతర పనులన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నాం. బాలకృష్ణను దర్శకుడు పరుచూరి మురళి తెరపై ఆవిష్కరించిన విధానమే ఈ చిత్రానికి హైలైట్. ఇప్పటివరకూ కనిపించని కొత్త బాలయ్యను ఇందులో చూస్తారు. ఒక పాత్రకూ మరో పాత్రకూ పొంతన లేకుండా మూడు పాత్రలనూ అద్భుతంగా పోషించారు బాలకృష్ణ. ఇది తప్పకుండా జనం మెచ్చే సినిమా అవుతుంది అని చెప్పారు.
దర్శకుడు పరుచూరి మురళి మాట్లాడుతూ "బాలకృష్ణ ఇమేజ్‌ని, బాడీలాంగ్వేజ్‌ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన కథ ఇది. ఆయన అభిమానులను రంజింపచేసే అన్ని అంశాలకు ఇందులో పెద్ద పీట వేశాం. బాలకృష్ణ నటన, యాక్షన్ ఎపిసోడ్స్, సెంటిమెంట్ సీన్స్, వినోదం, పాటలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి'' అని చెప్పారు. జయసుధ, లక్ష్మీరాయ్, సలోని, సుకన్య కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, ఆదిత్య మీనన్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి, సంగీతం: కళ్యాణిమాలిక్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్, నిర్మాణం: శ్రీ కీర్తి కంబైన్స్.


Click it and Unblock the Notifications











