»   » ఇంత స్టైల్‌గా బాలయ్యను ఎప్పుడూ చూడలేదు( న్యూ స్టిల్)

ఇంత స్టైల్‌గా బాలయ్యను ఎప్పుడూ చూడలేదు( న్యూ స్టిల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాబోయే సంక్రాంతికి బాలయ్య ‘డిక్టేటర్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య గతంలో ఎన్నడూ లేనంత స్టైలిష్ లుక్ తో కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన డిక్టేటర్ కొత్త పోస్టర్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

స్టైలిష్ లుక్‌లో బాలయ్య విలన్స్‌కి వార్నింగ్ ఇస్తున్నట్టున్న ఈ స్టిల్‌తో అభిమానుల్లో అంచనాలు పెంచేశారు దర్శకుడు శ్రీవాస్. అంజలి, సోనాల్ చౌహన్, అక్ష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ స్వరాలందించిన ఈ సినిమా నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉంది.

డిక్టటర్ మూవీని జనవరి 14న విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేసారు. పండగ రోజు బాలయ్య సినిమా చూడటం మరింత మాకు మరింత ఆనందాన్ని కలిగిస్తుందని అభిమానులు అంటున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ఆడియోను డిసెంబర్ 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఫైట్ మాస్టర్ రవివర్మ నేతృత్వంలో క్లయిమాక్స్ ఫైట్ ను భారీ లెవల్లో చిత్రీకరిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంత కంటే ముందుగా పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, అభిమానులు సమక్షంలో ఆడియో వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను అమరావతి వేదికైంది. ఇటీవల ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా ఇటీవ కాలచక్రను నిర్వహించారు. ఆ కార్యక్రమం తర్వాత అమరావతిలో జరగున్ను వేడుక ‘డిక్టేటర్‌' చిత్ర ఆడియో విడుదల. అంతే కాకుండా అమరావతిలో జరుగనున్న తొలి సినిమా కార్యక్రమం కూడా ఇదే కావడం విశేషం.

Balakrishna's Dictator new poster

సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌, కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.

English summary
Tollywood star Balakrishna's upcoming movie Dictator audio releasing on 20 December.
Please Wait while comments are loading...