పంచ్ డైలాగ్స్ వద్దంటూ ...'డిక్టేటర్'' ట్రైలర్ (వీడియో)
హైదరాబాద్ : పంచ్ డైలాగులు నా దగ్గర వద్దంటూ బాలయ్య వచ్చేస్తున్నాడు. బాలకృష్ణ తాజా చిత్రం ' 'డిక్టేటర్'' ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ తనదైన శైలి పంచ్ లతో బాలయ్య రెచ్చిపోయాడు.
బాలకృష్ణ మాట్లాడుతూ...‘‘డిక్టేటర్ అంటే నియంత. ఇది నా స్వభావానికి దగ్గరగా ఉండే పేరు. చైతన్యం, మార్పు కోసం ఒక్కోసారి జులుం ప్రదర్శించక తప్పదు. అప్పుడప్పుడు అత్యవసరం కూడా. ఇదే మా సినిమా నేపథ్యం. ఈ పండగకు మీ ముందుకు వస్తున్నాం. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను''అన్నారు.
నందమూరి బాలకృష్ణ, అంజలి నటిస్తున్న కొత్త చిత్రం ' 'డిక్టేటర్''. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో ప్రక్క ఆడియోని రెడీ చేసి, డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇది బాలకృష్ణకు 99వ చిత్రం కావడం విశేషం.

నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.


Click it and Unblock the Notifications











