నందమూరి బాలకృష్ణ ప్రపంచ రికార్డు.. చరిత్ర సృష్టించిన 81 వేల అభిమానులు
నందమూరి బాలకృష్ణకు అభిమానులు అరుదైన రికార్డును అంకింతం ఇచ్చారు. తన అభిమాన నటుడు జన్మదినం రోజున అత్యధిక కేకులు కట్ చేసి చరిత్ర సృష్టించారు. ఈ మేరకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రికార్డుకు సంబంధించిన పత్రాలను అందించడానికి సిద్దమయ్యారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా ప్రశంసా పత్రాలను ఇవ్వలేకపోతున్నామని, పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆ పత్రాలను అందజేస్తామని సంస్థలు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంతకు బాలకష్ణ అభిమానులు కట్ చేసిన కేకులు ఎన్నో తెలుసా?

జూన్ 10వ తేదీన వరల్డ్ రికార్డు
నందమూరి బాలకృష్ణ ఇటీవల తన 60వ జన్మదినాన్ని జూన్ 10వ తేదీన జరుపుకొన్నారు. అయితే కరోనావైరస్ కారణంగా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. తన పుట్టిన రోజు వేడుకల కంటే అభిమానుల ప్రాణాలే ముఖ్యమని బాలయ్య స్పష్టం చేశారు. ప్రచార ఆర్బాటం చేయకుండా కుటుంబ సభ్యులతో కలిసి జన్మదిన వేడుకలను సాదాసీదాగా నిర్వహిస్తే అదే సంతోషమని ఆయన అభిమానులకు సూచించారు.

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్
బాలకృష్ణ సూచనలు పాటిస్తూనే.. కోవిడ్ 19 నిబంధలకు అనుగుణంగా అభిమానులు చరిత్ర లిఖించేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రికార్డు సంస్థలకు లేఖ రాశారు. బాలకృష్ణ పుట్టిన రోజున అంటే జూన్ 10వ తేదీన 10: 10 గంలకు 21 వేల కేకులను ప్రపంచవ్యాప్తంగా కట్ చేసి చరిత్రకు బాటలు వేశారు. ఈ ఘనకార్యాన్ని ఆ రెండు సంస్థలు గుర్తించి రికార్డును నమోదు చేశాయి.

ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ పర్యవేక్షణలో
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంబంధించిన రికార్డు గురించి అనంతపురంకు చెందిన ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి జగన్ మీడియాకు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా బాలయ్య అభిమానులు 21 వేల కంటే ఎక్కువ కేకులు కట్ చేసి చరిత్ర సృష్టించారు. కరోనా పరిస్థితుల్లో ఇంటిపట్టునే ఉండి ఒకే సమయంలో పెద్ద మొత్తంలో కేక్ కట్ చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకొన్నారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా దాదాపు 80 వేల మంది ఫ్యాన్స్ ఈ చరిత్రలో భాగమయ్యారు అని తెలిపారు.
Recommended Video

సహృదయంతో పుట్టిన రోజును వేడుకలా..
మా కుటుంబంలో బాలకృష్ణను ఒక సభ్యుడిగా భావిస్తాం. కుటుంబ సభ్యులతో కలిసి బాలయ్య పుట్టిన రోజును జరుపుకోవడం ఓ మధురమైన భావన. సహృదయంతో బాలయ్య పుట్టిన రోజును ఓ వేడుకలా జరుపుకొన్నాం. మమ్మల్ని బయటకు రాకుండా కరోనా ఆపింది. కానీ బాలకృష్ణపై ఉండే ప్రేమను ఎవరూ ఆపలేరు అని ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి జగన్ మీడియాకు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రికార్డులో భాగమైన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు తెలిపారు.


Click it and Unblock the Notifications










