బాలయ్యకు ఆరుగురు విలన్లు!
నందమూరి నట సింహం బాలయ్యకు ఒకరు కాదు, ఇద్దరు కాదు...ఏకంగా ఆరుగురు విలన్లు తయ్యారయ్యారు. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదులెండి. రవి చావలి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న 'శ్రీమన్నారాయణ' చిత్రంలో బాలయ్య ఆరుగురు విలన్లతో ఫైట్ చేయబోతున్నాడు.
ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన సాంగు చిత్రీకరణ పద్మాలయా స్టూడియోలో జరిగింది. బాలకృష్ణ, పార్వతి మెల్టన్, ఇషా చావ్లాలపై రొమాంటిక్ సాంగు షూట్ చేశారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో ఆరుగురు విలన్లతో బాలయ్య పోరాటం ఆసక్తికరంగా ఉంటుంది.. ఆయన రియల్ లైఫ్‌లో జరిగిన జరిగిన విషయాలను ఈ సినిమాలో వాడుతున్నాను అని దర్శకుడు రవి చావలి చెప్పారు. సంగీత దర్శకుడు చక్రి ..సింహా తర్వాత మరో సారి బాలకృష్ణ సినిమాకు పనిచేస్తున్నారు.
ఆ విషయాలు పక్కన పెడితే...బాలకృష్ణ పరుచూరి మురళి దర్శకత్వంలో నటించిన 'అధినాయకుడు' చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఎంఎల్ కుమార్ చౌదరి ఈచిత్రాన్ని నిర్మించారు. అలాగే బాలకృష్ణ అతిథి పాత్రలో నటిస్తున్న 'ఊ కొడతారా ఉలిక్క పడతారా' చిత్రం షూటింగ్ దశలో ఉంది. మంచులక్ష్మి నిర్మిస్తున్న ఈచిత్రంలో మనోజ్ కథానాయకుడు.


Click it and Unblock the Notifications











