జై సింహ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ అదుర్స్.. దానవీర శూర కర్ణ నరసింహుడు.. పారిపో..

బాలయ్య.. 102 చిత్రంతో మరోసారి సంక్రాంతి బరిలో దూకారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు.

By Rajababu

Recommended Video

జై సింహ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ అదుర్స్

ప్రముఖ నిర్మాత చిల్లర కళ్యాణ్ సీకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 102వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను బుధవారం మధ్నాహ్నం 4.44 గంటలకు రిలీజ్ చేశారు.

దానవీర శూర కర్ణ నరసింహుడు

వైజాగ్ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని చూపుతూ మోషన్ పోస్టర్ ప్రారంభవుతుంది. దానవీర శూర కర్ణ నరసింహుడు అతడు అనే పాటతో టీజర్ ఆకట్టుకునేలా ఉంది.. కదిరి నరసింహుడు అతడు..పారిపో అంటూ వచ్చే డైలాగ్స్‌తో పాట ఆకట్టుకునేలా ఉంది.

వైజాగ్‌లో షూటింగ్

వైజాగ్‌లో షూటింగ్

ప్రస్తుతం వైజాగ్ బీచ్ రోడ్‌లో 5 వేల జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో బాలయ్య నిర్వహించే మహాధర్నా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లోనే బాలకృష్ణ, హీరోయిన్ హరిప్రియపై ఓ పాటను చిత్రీకరించనున్నారు. అలాగే బాలయ్యపై ఓ మాంటేజ్ సాంగ్‌ను షూట్ చేస్తామని ఇటీవల నిర్మాత సీ కల్యాణ్ తెలిపారు.

సూపర్ హిట్ కావడం ఖాయం

సూపర్ హిట్ కావడం ఖాయం

బాలయ్య 102 చిత్రానికి చిత్రానికి "జై సింహా" అనే టైటిల్‌ ఖరారు చేశాం. బాలయ్య కెరీర్‌లో సింహా అనే టైటిల్స్‌తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అని ఇటీవల సీ కల్యాణ్ తెలిపిన సంగతి తెలిసిందే.

నవంబర్ 1న ఫస్ట్ లుక్

నవంబర్ 1న ఫస్ట్ లుక్

నవంబర్ 1న సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి.. జనవరి 12న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం అని కల్యాణ్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X