Don't Miss!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాలయ్య వీరవిహారం.. నటసింహానికి ఎందుకంత కోపం.. ఎవరిపై దాడి చేస్తున్నారంటే..
ఈ ఫొటో చూసి నటసింహ బాలయ్య దాడి చేస్తున్నారనుకొంటే పొరపాటు పడినట్టే.. జై సింహ చిత్ర షూటింగ్లో భాగంగా బాలయ్య నటిస్తున్న ఓ సీన్లో ఓ భాగం. పైసా వసూల్ వసూలు తర్వాత బాలయ్య.. 102 చిత్రంతో మరోసారి సంక్రాంతి
Recommended Video
ఈ ఫొటో చూసి నటసింహ బాలయ్య దాడి చేస్తున్నారనుకొంటే పొరపాటు పడినట్టే.. జై సింహ చిత్ర షూటింగ్లో భాగంగా బాలయ్య నటిస్తున్న ఓ సీన్లో ఓ భాగం. పైసా వసూల్ వసూలు తర్వాత బాలయ్య.. 102 చిత్రంతో మరోసారి సంక్రాంతి బరిలో దూకారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ చిత్రానికి చెందిన కొన్ని ఫోటోలు మీడియాలో హల్చల్ రేపుతున్నాయి.
బాలయ్య 102వ చిత్రం
ప్రముఖ నిర్మాత చిల్లర కళ్యాణ్ సీకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 102వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్నారు.
వైజాగ్‌లో షూటింగ్
ప్రస్తుతం వైజాగ్ బీచ్ రోడ్లో 5 వేల జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో బాలయ్య నిర్వహించే మహాధర్నా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లోనే బాలకృష్ణ, హీరోయిన్ హరిప్రియపై ఓ పాటను చిత్రీకరించనున్నారు. అలాగే బాలయ్యపై ఓ మాంటేజ్ సాంగ్‌ను షూట్ చేస్తాం.
సూపర్ హిట్ కావడం ఖాయం
బాలయ్య 102 చిత్రానికి చిత్రానికి "జై సింహా" అనే టైటిల్ ఖరారు చేశాం. బాలయ్య కెరీర్లో సింహా అనే టైటిల్స్‌తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడం ఖాయం.
నవంబర్ 1న ఫస్ట్ లుక్
నవంబర్ 1న సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి.. జనవరి 12న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. భారీ బడ్జెట్‌తో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం.