మోహన్‌బాబు సెట్లో బాలయ్య.. జై సింహా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్

By Rajababu

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున యాక్షన్ ఎంటర్ టైనర్ "జై సింహా". బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం నేటితో రామోజీ ఫిలిమ్ సిటీలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తి చేసుకొని టాకీ పార్ట్ పూర్తి చేసుకోనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న "జై సింహా" చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

 60 మంది ఫైటర్స్‌తో బాలయ్య‌

60 మంది ఫైటర్స్‌తో బాలయ్య‌

రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో బాలకృష్ణ-అశుతోష్ రాణా కాంబినేషన్ లో 60 మంది ఫైటర్స్ తో రామ్-లక్ష్మణ్ ల నేతృత్వంలో ఒక కృషియల్ ఫైట్ సీక్వెన్స్‌ను తెరకెక్కించారు. దాంతో సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలిసింది.

బాలయ్య-నయనతార కాంబినేషన్ హిట్

బాలయ్య-నయనతార కాంబినేషన్ హిట్

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. "బాలయ్య-నయనతారల కాంబినేషన్ ఈ సినిమాలో విశేషంగా అలరిస్తుంది. ఇవాల్టితో రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన భారీ సెట్ లో ఫైట్ సీక్వెన్స్ పూర్తవుతుంది. దీంతో టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్లే అని తెలిపారు.

 జనవరి 12న జై సింహ రిలీజ్

జనవరి 12న జై సింహ రిలీజ్

టైటిల్ మరియు బాలకృష్ణ ఫస్ట్ లుక్ కి నందమూరి అభిమానుల నుంచే కాక తెలుగు సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానున్న సినిమా కూడా అదే స్థాయిలో అలరిస్తుంద అని కల్యాణ్ అన్నారు.

 మోహన్‌బాబు సెట్లో బాలకృష్ణ

మోహన్‌బాబు సెట్లో బాలకృష్ణ

ఇదిలా ఉండగా, డైలాగ్ కింగ్ మోహన్‌బాబు నటిస్తున్న ఓ చిత్ర షూటింగ్‌కు బాలకృష్ణ వెళ్లి ఆశ్చర్యపరిచారు. మోహన్‌బాబుతో కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వెంట మంచు విష్ణు ఉన్నాడు. మోహన్‌బాబు కుటుంబంతో బాలకృష్ణకు మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్, లక్ష్మీ నటించిన ఊ కొడుతారా.. ఉలిక్కిపడుతారా చిత్రంలో కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.

 నటీనటులు, సాంకేతికవర్గం

నటీనటులు, సాంకేతికవర్గం

బాలకృష్ణ, నయనతార, న‌టాషా దోషీ, హరిప్రియ, ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, పోరాటాలు: అంబరివ్-రామ్ లక్ష్మణ్-వెంకట్, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ-నిర్మాత: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వరుణ్-తేజ, నిర్మాణం: సీకే ఎంటర్ టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X