పగతో రగులుతున్న సింహం: బాలయ్య ‘జై సింహా’ టీజర్ అదుర్స్
Recommended Video

నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా జోషి, హరిప్రియ ప్రధాన పాత్రధారులుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "జై సింహా". ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా 30 సెకన్ల నిడివిగల టీజర్ విడుదల చేశారు.

బాలయ్య
ఈ చిత్రంలో బాలయ్య జై సింహ అనే పాత్రలో కనిపించబోతున్నారు. పగతో రగిలిపోయే ఉగ్రనరసింహుడిగా ఆయన కనిపిస్తారని టీజర్ చూస్తు స్పష్ట అవుతోంది. టీజర్ రిలీజైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

డైలాగ్స్ అదుర్స్
సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు, సైలెంటుగా ఉందని కెలికితే సాలా కొరికేస్తది..... అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య అభిమానులు మెచ్చే విధంగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

నయనతార అందం మరో హైలెట్
ఈ సినిమాలో నయనతార అందం మరో హైలెట్ కానుంది. టీజర్లో ఆమెపై చిత్రీకరించిన షాట్స్ అందంగా ఉన్నాయి. గతంలో బాలయ్య, నయనతార కాంబినేషన్లో వచ్చిన సింహా చిత్రంలో ఈ ఇద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్బ్ అనేలా ఉంది. అదే మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

విజయవాడలో గ్రాండ్‌గా ఆడియో ఫంక్షన్
"జై సింహా" ఆడియోను డిసెంబర్ 24న విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. విజయవాడలోని వజ్ర గ్రౌండ్స్ లో అత్యంత ఘనంగా ఆడియో వేడుకను నిర్వహించనున్నారు.
నటీనటులు, తెర వెనక
నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా జోషి, హరిప్రియ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా, మురళి మోహన్, జయప్రకాష్ రెడ్డి, ప్రభాకర్, శివపార్వతి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, యాక్షన్: అంబరివ్-రామ్ లక్ష్మణ్-వెంకట్, కెమెరా: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహనిర్మాత: సి.వి.రావు, కార్యనిర్వాహక నిర్మాతలు: వరుణ్-తేజ, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.


Click it and Unblock the Notifications











