»   » బాలకృష్ణ ‘లెజెండ్’ ఫస్ట్ లుక్ (ఫోటో)

బాలకృష్ణ ‘లెజెండ్’ ఫస్ట్ లుక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

విశాఖ: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లెజండ్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం విశాఖ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటో ఒకటి లీకైంది. రూ. 20 లక్షల ఖర్చుతో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన హార్లే డేవిడ్సన్ బైకు బాలయ్య ఆ ఫోటోలో దర్శనమిచ్చారు. ఈ ఫోటోలో బాలయ్య లుక్ చూస్తుంటే....దర్శకుడు బోయపాటి ఆయన్ను 'సింహా' రేంజిలో సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ విశాఖలో జరుగుతోంది. షూటింగు సందర్బంగా బాలకృష్ణ ఎడమ చేయి మణికట్టు బెణికింది. అక్కడ వాపు రావడంతో ఆయన ఫిజియో థెరపిస్టును సంప్రదించారు. ఎక్స్‌రే తీసుకోవాలన్న వైద్యుల సూచన మేరకు పార్క్ హోటల్‌లో బసచేసిన బాలకృష్ణ బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు సెవెన్ హిల్స్ ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం ఆయన బీచ్ రోడ్‌లో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నారు.

 Balakrishna's Legend first look

గురువారం షూటింగ్ ఏమీ జరుగలేదు. ఉదయం పూట బాలకృష్ణ హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ చేసారు. మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుని సాయంత్రం పూట మరోసారి హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ చేస్తారని యూనిట్ సభ్యుల నుంచి సమాచారం అందింది. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తారు. పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను. దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని బాలయ్య రాజకీయ భవిష్యత్‌కు ఉపకరించేలా రూపొందిస్తున్నాడట. బాలయ్య అభిమానులను, తెలుగు దేశం పార్టీలను అలరించేలా సినిమాలో డైలాగులు ఉంటాయని, కొన్ని సన్నివేశాలు కూడా బాలయ్య అభిమానుల్లో జోష్ నింపే విధంగా ఉంటాయని టాక్.

English summary
Nandamuri Balakrishna's Legend first look photo leaked. He was seen waiting for the action call from the director for riding this customized yellow-coloured Harley Davidson which costed the makers a whooping amount. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu