twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య 'లెజండ్' ఇప్పుడప్పుడే కాదా?

    By Srikanya
    |

    Balakrishna
    హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'లెజండ్' . ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే... ఫిబ్రవరిలో కూడా ఈ చిత్రం షూటింగ్ ఉంటుందని సమాచారం. దాంతో పిభ్రవరిలో విడుదల అయ్యే అవకాసం లేదు. దాంతో ఎప్పుడు ఈ చిత్రం విడుదల అవుతుంది అనే విషయపై అభిమానులు క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు. నిర్మాతల సైడు నుంచి అఫీషియల్ గా ప్రకటన వస్తే బాగుంటుందని భావిస్తున్నారు.

    చిత్రం షెడ్యూల్ వివరాలకి వస్తే... నవంబర్ 4 నుంచి డిసెంబర్ 6 వరకూ వైజాగ్‌లో ఈ చిత్రానికి సంబంధించి భారీ షెడ్యూల్ చేశారు. ఈ నెల 12 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ మొదలు కానుంది. జనవరి 14 వరకూ జరిగే ఈ షెడ్యూల్‌లో ఓ పాటను, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు.

    బాలయ్యతో 'సింహా' లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడవ్వడం, 'దూకుడు' లాంటి హిట్ తర్వాత నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం... ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి.ఈ చిత్రంలో లో బాలయ్య పాత్రలో రెండు రకాల కోణాలుంటాయని, అత్యంత శక్తిమంతంగా ఆయన పాత్ర ఇందులో ఉంటుందని సమాచారం.

    జనవరిలో బాలకృష్ణ, చిత్ర హీరోయిన్స్ తో పాటు ఓ గెస్ట్ హీరోయిన్ పై చిత్రీకరించే పాట ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనుందని తెలుస్తోంది. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్‌సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తారు.

    పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను. దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని బాలయ్య రాజకీయ భవిష్యత్‌కు ఉపకరించేలా రూపొందిస్తున్నాడట. బాలయ్య అభిమానులను, తెలుగు దేశం పార్టీలను అలరించేలా సినిమాలో డైలాగులు ఉంటాయని, కొన్ని సన్నివేశాలు కూడా బాలయ్య అభిమానుల్లో జోష్ నింపే విధంగా ఉంటాయని చెప్పుకుంటున్నారు.

    ఈ చిత్రంలో బాలకృష్ణ సరికొత్తగా కనిపిస్తారు. ఆయన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన బుల్లెట్ బైక్, సఫారీ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సినిమా షూటింగ్ మొత్తాన్ని సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం, అందుకు బాలకృష్ణ కూడా ఎంతగానో సహకరిస్తున్నారని చిత్ర నిర్మాతలు తెలిపారు. దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ...'ఈచిత్రంపై అభిమానులకు భారీ అంచనాలు ఉండటం సహజం. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గని విధంగా ఈచిత్రం రూపుదిద్దుకుంటోంది' అన్నారు.

    English summary
    Bala Krishna’s forthcoming movie Legend next Shedule will be at Vizag. Bala Krishna will be seen in a new look in the film and a special bullet and safari car have been designed for the actor for Legend film. Legend is being directed by Boyapati Srinu and produced jointly by 14 Reels Entertainment banner and Varahi Chalana Chitram. Music is by Devi Sri Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X