»   » బాలకృష్ణ 'లెజెండ్‌' లోగో విడుదల (ఫోటో)

బాలకృష్ణ 'లెజెండ్‌' లోగో విడుదల (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్‌: 14రీల్స్‌ , వారాహి చలన చిత్రం పతాకం సంయుక్త సమర్పణలో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'లెజెండ్‌'. ఈ చిత్రం లోగోను చిత్ర యూనిట్ శనివారం సాయింత్రం విడుదల చేసింది. దేవిశ్రీప్రసాద్‌ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌ఆచంట, గోపిచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

    నిర్మాత మాట్లాడుతూ... ''శక్తివంతమైన నాయకుడికి ప్రతిరూపంగా బాలకృష్ణ ఇందులో కనిపిస్తారు. ప్రస్తుత సమాజ స్థితిగతుల్ని సునిశితంగా పరిశీలించి దర్శకుడు ఈ కథని సిద్ధం చేసుకున్నారు. బాలకృష్ణను 'సింహా'గా చూపించిన బోయపాటి మరోసారి ఆ స్థాయిలో చూపించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి చక్కటి స్పందన వస్తోంది''అన్నారు. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

    Balakrishna's 'Legend' logo relesed

    ఇక ఈ చిత్రం ఆడియో ని మార్చి 7 న శిల్పకళా వేదికలో విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ఫిక్స్ అయినట్లు సమాచారం. అలాగే చిత్రం ఫస్ట్ టీజర్ ని కూడా అతి త్వరలో లాంచ్ చేస్తారు. అలాగే మార్చి 28న గానీ, లేదంటే ఏప్రిల్‌ 4న గానీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ప్రస్తుతం దుబాయ్‌లో 'లెజెండ్‌' చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ కీలకమైన యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు.

    ''బాలకృష్ణని ఓ కొత్త తరహాలో చూపిస్తున్నాం. ఆయన మూడు గెటప్పుల్లో కనిపిస్తారు. బాలకృష్ణ పలికే ప్రతి సంభాషణ.. అభిమానుల్ని అలరించేలా ఉంటుంది'' అని దర్శకుడు చెప్తున్నారు. బాలయ్యతో 'సింహా' లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడవ్వడం, 'దూకుడు' లాంటి హిట్ తర్వాత నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం... ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి.ఈ చిత్రంలో లో బాలయ్య పాత్రలో రెండు రకాల కోణాలుంటాయని, అత్యంత శక్తిమంతంగా ఆయన పాత్ర ఇందులో ఉంటుందని సమాచారం.

    పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను. దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని బాలయ్య రాజకీయ భవిష్యత్‌కు ఉపకరించేలా రూపొందిస్తున్నాడట. బాలయ్య అభిమానులను, తెలుగు దేశం పార్టీలను అలరించేలా సినిమాలో డైలాగులు ఉంటాయని, కొన్ని సన్నివేశాలు కూడా బాలయ్య అభిమానుల్లో జోష్ నింపే విధంగా ఉంటాయని చెప్పుకుంటున్నారు.

    English summary
    Balakrishna’s ‘Legend’ movie title logo is out. The logo looks promising and lion is seen roaring in background of title. Texture designed for the title and font are good. Legend story is in the lines of Simha and Balakrishna will be seen in dual roles- as a powerful politician and in a youthful character.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more