లెజెండ్ : బాలయ్య రహస్య ఎజెండా తేటతెల్లం!
హైదరాబాద్: నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 'లెజెండ్' చిత్రం బాలయ్య రాజకీయ భవిష్యత్‌కు ఉపయోగపడేలా చిత్రీకరిస్తున్నారని, పాలిటిక్స్‌లో ఆయన ఎంట్రీ పవర్‌ఫుల్ ఉండాలనే కోణంలోనే ఈ చిత్రాన్ని ప్లాన్ చేసినట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఆ ఊహాగానాలు నిజమయ్యాయి. 'లెజెండ్' చిత్రం పూర్తిగా బాలయ్య రాజకీయ అరంగ్రేటానికి ప్లస్సయ్యేలా చిత్రీకరించారనే విషయం తేటతెల్లమైంది. 'లెజెండ్' క్లైమాక్స్ సీన్ ఇందుకు స్పష్టమైన ఉదాహరణ. సినిమా విడుదలైన తర్వాత జరుగుతున్న 'లెజెండ్' విజయ యాత్ర కూడా.....బాలయ్య పొలికల్ యాత్రలా సాగడమే ఇందుకు నిదర్శనమని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
'లెజెండ్' విజయ యాత్రకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో......

లెజెండ్
ఇటీవల విడుదలైన లెజెండ్ చిత్రం బాలయ్య కెరీర్లోనే ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. కలెక్షన్ల విషయంలో ‘లజెండ్' చిత్రం అంచనాలు మించి పోయింది. సినిమా సాధిస్తున్న కలెక్షన్లు ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తున్నాయి.

ముందస్తు ప్లానింగ్
బాలయ్య రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న తరువాత ‘లెజెండ్' చిత్రం మొదలైంది. సరిగ్గా ఎన్నికలకు నెల రోజుల ముందు ఈ సినిమాను విడుదల చేసారు. దీన్ని బట్టి ముందస్తు ప్లానింగుతోనే ఈ చిత్రాన్ని విడుదల చేసినట్లు తెలుస్తోంది.

సినిమా ద్వారా ప్రభావం ఎక్కువ
బాలయ్య సాదాసీదాగా రాజకీయారంగ్రేటం చేస్తే ఉండే ప్రభావం తక్కువ. ఆయన రాజకీయ తెరంగ్రేటానికి ఊపు తేవడంలో భాగంగానే ‘లెజెండ్' చిత్రాన్ని తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది.

బాలయ్య బిజీబిజీ
ప్రస్తుతం బాలయ్య వివిధ ప్రాంతాల్లో ‘లెజెండ్' విజయ యాత్ర నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. విజయ యాత్రలో భాగంగా ఆయన గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు తిరుపతిలోని ప్రతాప్ థియేటర్లో అభిమానులను కలిసారు.

లెజెండ్ రాజకీయాలు
లెజెండ్ విజయయాత్రలో పాల్గొన్న బాలయ్యకు ఎక్కడికెళ్లినా మీడియా వారి నుండి రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఈదర్భంగా బాలయ్య మాట్లాడుతూ...లెజెండ్ విజయోత్సవ యాత్ర పూర్తి కాగానే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన తర్వాత, తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని వెల్లడిస్తానని ఆయన అన్నారు.

టీడీపీకి ఓటేయాలని ప్రచారం
‘లెజెండ్' విజయయాత్రలో భాగంగా బాలయ్య పనిలో పనిగా తను రాజకీయ ఆరంగ్రేటం చేయబోయే పార్టీ, తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అయిన ‘తెలుగు దేశం' పార్టీని ఆదరించాలని కోరుతుండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











