అర్ధరాత్రి పన్నెండింటికి..బాలయ్య రచ్చ

By Srikanya

హైదరాబాద్ : అర్దరాత్రి పన్నెండు గంటలకు నందమూరి బాలకృష్ణ రచ్చ చేయనున్నారు. ఆయన తన అభిమానులకు కొత్త సంవత్సరం కానుక ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు . ఆయన సత్యదేవా దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. రుద్రపాటి రమణారావు నిర్మాత. షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను డిసెంబరు 31, అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి 'వారియర్‌', 'లయన్‌' అనే రెండు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని ఆ రోజే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మరో ప్రక్క 98వ చిత్రం టైటిల్‌ విషయం వివాదంలో పడింది. సత్యదేవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘ లయన్‌ ' అనే పేరును ఏపీ ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారు. అయితే ఈ టైటిల్‌తో తెలంగాణ ఫిలిం ఛాంబర్‌లో ఎప్పుడో రిజిస్టర్ చేయించాను అంటూ ఓ నిర్మాత వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ టైటిల్‌ వివాదం ఫిలింనగర్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. వీలైనంత త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించుకుని డిసెంబర్‌ 31న టీజర్‌ విడుదల చేయాలని దర్శకుడు సత్యదేవ్‌ భావిస్తున్నట్లు సమాచారం.

చిత్రం విషయాలకి వస్తే..

Balakrishna's Lion :1st Look Teaser on Jan 1st 2015

ధర్మం ఎప్పుడూ ఒంటరికాదు. దానిని కాపాడ్డానికి ఎవరో ఒకరు శ్రమిస్తూనే ఉంటారు. ధర్మాన్ని నిలబెట్టి, న్యాయాన్ని రక్షించి, అవినీతిపై యుద్ధం చేసిన పౌరుడి కథే మా సినిమా అంటున్నారు సత్యదేవా. ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడు. త్రిష, రాధికా ఆప్టే కథానాయికలు. రుద్రపాటి రమణారావు నిర్మాత.

నిర్మాత మాట్లాడుతూ... ''లెజెండ్‌'తో బాలకృష్ణ ఇమేజ్‌ మరింత పెరిగింది. ఈ సినిమాలో ఆయన పాత్ర అందుకు ఏమాత్రం తగ్గదు. మణిశర్మ స్వరపరిచిన గీతాలు అందరినీ అలరిస్తాయ''న్నారు.

ఇక బాలకృష్ణ 99 వ చిత్రం విషయానికి వస్తే...

నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం(99 వ) నికి రంగం సిద్దమవుతున్నాడు. ఆ చిత్రానికి దర్శకుడుని ఎంపిక అయ్యారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు లౌక్యంతో హిట్ కొట్టిన శ్రీవాసు అని తెలుస్తోంది. ఆ మధ్యన బాలకృష్ణ కోసం కోన వెంకట్, గోపీ మోహన్ ఓ కథ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే కథని డైరక్ట్ చేయబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. బాలకృష్ణతో చేస్తూండటంతో అతను పెద్ద డైరక్టర్ల లీగ్ లోకి వెళ్లినట్లే.

రీసెంట్ గా బాలకృష్ణ తన కుటుంబంతో కలిసి లౌక్యం చిత్రాన్ని స్పెషల్ షో చూడటం జరిగింది. ఇంప్రెస్ అయిన బాలకృష్ణ ఓ వినోదాత్మకమైన చిత్రం చేయటానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే తన అభిమానులను నిరాశపరచకుండా యాక్షన్ సన్నివేశాలకు కూడా సరైన స్దానం స్క్రిప్టులు ఇవ్వమని కోరినట్లు సమాచారం. ఈ మేరకు స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ స్క్రిప్టు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

మరో ప్రక్క అందరూ రామ్ చరణ్ తో శ్రీవాస్ ముందుకు వెళ్తారని భావించారు. అయితే ఈ లోగా బాలకృష్ణ ఈ ఆఫర్ ఇవ్వటంతో ఇటు జంప్ అయినట్లు చెప్పుకుంటున్నారు. పాండవులు పాండవులు తుమ్మెద,లౌక్యం విజయాలతో మినిమం గ్యారెంటీ దర్శకుడుగా అతను టాలీవుడ్ లో సెటిల్ అయినట్లే. బాలకృష్ణతో కూడా అదే మాదిరిగా హిట్ కొడితే అతనికి తిరుగు ఉండదని సినీ వర్గాలు అంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X