బాలకృష్ణ ‘లయిన్’ విడుదల ఒక రోజు ముందుకు
హైదరాబాద్ :బాలకృష్ణ హిట్ చిత్రం లెజండ్ విడుదల తేదీ నే అంటే మార్చి 28న ఆయన కొత్త చిత్రం ‘లయిన్' ని సైతం విడుదల చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆరోజు శనివారం కావటంతో ఒక రోజు ముందు అంటే మార్చి 27న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం. మరి బాలకృష్ణ ఈ విషయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో తెలియదు. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు.
బాలయ్య 'లయన్' చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'లెజెండ్' లాంటి భారీ విజయం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. 'లయన్' చిత్రంలో కూడా బాలయ్య యాక్షన్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోబోతున్నాడు. సత్యదేవ్ దర్శకునిగా పరిచయమవుతోన్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
అటు రాజకీయంగా, ఇటు సినిమాపరంగా వరుస విజయాలు సాధిస్తూ ఊపుమీదున్న బాలకృష్ణ ఎంతో ఉత్సాహంతో ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బాలకృష్ణ గతంలో నటించిన ‘సీతారామకల్యాణం', ‘బొబ్బిలిసింహం', ‘తల్లిదండ్రులు' చిత్రాల తరహాలో మంచి హిట్ కొట్టబోతున్నామని నిర్మాత చెప్తున్నారు.
త్రిష మరియు రాధిక ఆప్టే హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా, సామాన్యుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సత్యదేవ దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. యాక్షన్ ఎంటర్టైనర్ గా అభిమానులను అలరించే అన్ని అంశాలతో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.

నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు. కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సినిమా టీజర్‌ని బుధవారం రాత్రి 11 గంటల 15 నిమిషాలకు విడుదల చేశారు. ఇందులో త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. బాలయ్య 'కొందరు కొడితే ఎక్సరేలో కనపడుతుంది. మరికొందరుకొడితే స్కానింగ్ లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది.' అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
నిర్మాత మాట్లాడుతూ.. '''లెజెండ్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ మా సినిమా చేయడం ఆనందంగా ఉంది. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా శక్తిమంతమైన కథను సత్యదేవ్ సిద్ధం చేశారు. ఈ చిత్రంతో తను అగ్ర దర్శకుల జాబితాలో చేరడం ఖాయం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో భారీ నిర్మాణ విలువలతో మేం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.'' అని చెప్పారు.
'లెజెండ్' తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉండటం సహజం. అందుకు తగ్గట్టుగానే అత్యంత శక్తిమంతంగా ఇందులోని బాలయ్య పాత్ర ఉండబోతోందని వినికిడి. సత్యదేవ్ సంభాషణలు కూడా ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనున్నాయని సమాచారం. గన్ నుంచి విడుదలయ్యే బుల్లెట్‌కి దయా దాక్షిణ్యాలుండవ్. దానికి తెలిసిందల్లా లక్ష్యం ఒక్కటే. దాన్ని ఛేదించేదాకా అది వదలదు. ఈ లక్షణాలతో ఓ పాత్రను సృష్టిస్తే? ఆ పాత్రను బాలకృష్ణ పోషిస్తే? ఇక అభిమానులకు అంతకంటే కావల్సిందేముంటుంది! సత్యదేవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో బాలకృష్ణ అలాగే కనిపించనున్నారని చెప్తున్నారు.
బాలయ్య సరసన తొలిసారి త్రిష ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఎల్.వి.సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్నారు. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్‌రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత.


Click it and Unblock the Notifications











