అయోమయానికి తెర: బాలయ్య ‘లయన్’ రిలీజ్‌పై క్లారిటీ

By Bojja Kumar

హైదరాబాద్: ఇప్పటికే ‘లెజెండ్' సినిమాతో భారీ విజయం అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలో సత్యదేవ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లయన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియో, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది.

ఈ సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా అయోమయం నెలకొంది. తొలుత ఈ సినిమాను మేడే సందర్భంగా మే 1న విడుదల చేయాలనుకున్నారు. తర్వాత ఒకరోజు ముందుకు అంటే ఏప్రిల్ 30వ తేదీకి షిఫ్ట్ అయినట్టు ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాను మళ్ళీ మే1కే విడుదల చేసేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఈ డేట్ ఫిక్స్ చేసినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యంలో జివ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సత్య దేవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తొలిసారిగా బాలయ్యతో త్రిష జతకడుతుండగా...‘లెజెండ్' అనంతరం రాధిక ఆప్టే మరోమారు బాలకృష్ణ సరసన నటిస్తోంది.

Lion

బాలయ్య నటించిన గత చిత్రం ‘లెజెండ్' భారీ హిట్టయిన నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది పబ్లిసిటీ జోరు పెంచారు. సినిమాకు సంబంధించిన సరికొత్త స్టిల్స్ విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇటీవల శిల్పకళా వేదికలో జరిగిన ‘లయన్' ఆడియో వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభిమానుల సమక్షంలో పంక్షన్ గ్రాండ్ గా జరిగింది. నిర్మాత రమణారావు మాట్లాడుతూ...ఈ చిత్రంలో బాలయ్య గారి పాత్రను దర్శకుడు సత్యదేవ మలిచిన తీరు, ఆయన చేత పలికించిన సంబాషణలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. బాలకృష్ణ-మణిశర్మ కాంబినేషన్ లో వస్తున్న మరో మ్యూజికల్ సెన్నేషన్ హిట్ ఈ సినిమా' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X