బాలయ్య యాక్షన్.....(లయన్ లొకేషన్ స్టిల్స్)
హైదరాబాద్: నందమూరి నట సింహం బాలయ్య ‘లయన్' చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘లెజెండ్' లాంటి భారీ విజయం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ‘లయన్' చిత్రంలో కూడా బాలయ్య యాక్షన్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోబోతున్నాడు. తాజాగా ‘లయన్' చిత్రానికి సంబంధించి ఫైటన్ సీన్ల చిత్రీకరణ లోకేషన్ స్టిల్స్ బయటకు వచ్చాయి. ఆ ఫోటోలపై మీరూ ఓ లక్కేయండి.
సత్యదేవ్ దర్శకునిగా పరిచయమవుతోన్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సినిమా టీజర్‌ని బుధవారం రాత్రి 11 గంటల 15 నిమిషాలకు విడుదల చేశారు. ఇందులో త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్.

'కొందరు కొడితే ఎక్సరేలో కనపడుతుంది. మరికొందరుకొడితే స్కానింగ్ లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది.' అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో ఆయన పవర్ ఫుల్ సీబీఐ అధికారిగా భిన్నకోణాల్లో నటిస్తున్నారు.
ధర్మం ఎప్పుడూ ఒంటరికాదు. దానిని కాపాడ్డానికి ఎవరో ఒకరు శ్రమిస్తూనే ఉంటారు. ధర్మాన్ని నిలబెట్టి, న్యాయాన్ని రక్షించి, అవినీతిపై యుద్ధం చేసిన పౌరుడి కథే మా సినిమా అంటున్నారు దర్శకుడు సత్యదేవా. 'లెజెండ్'తో బాలకృష్ణ ఇమేజ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో ఆయన పాత్ర అందుకు ఏమాత్రం తగ్గదు. మణిశర్మ స్వరపరిచిన గీతాలు అందరినీ అలరిస్తాయ''న్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ''చిత్రంలో బాలకృష్ణ నాయకుడిగా, బాధ్యతగల అధికారిగా వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు. విడుదల చేసిన ఫస్ట్‌లుక్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిత్రానికి సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: వెంకట్‌ప్రసాద్.


Click it and Unblock the Notifications











