For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇది సిబీఐ గర్జన ( 'లయన్' ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్: ‘‘ కొందరు కొడితే ఎక్సరేలో కనపడుతుంది, మరికొందరు కొడితే స్కానింగ్‌లో కనపడుతుంది, నేను కొడితే..హిస్టరీలో వినబడుతుంది '' అంటూ బాలయ్య గర్జిస్తూ ఈ రోజు థియోటర్స్ కు వచ్చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న 98వ చిత్రం ‘లయన్‌'. నూతన దర్శకుడు సత్యదేవ్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  నిజాయతీని నమ్ముకొన్న సీబీఐ అధికారి అతను. అయితే 'చట్టం తనపని తాను చేసుకుపోతుంది..' తరహా రొటీన్‌ డైలాగులు చెప్పడు. చట్టం కంటే వేగంగా స్పందిస్తాడు. న్యాయస్థానాలు, న్యాయశాస్త్రాలపై నమ్మకం ఉన్నా.. తనే ఓ న్యాయస్థానమై న్యాయమూర్తిగా తీర్పులిచ్చాడు. దుర్మార్గుల్ని శిక్షించాడు. అతని కథేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నందమూరి బాలకృష్ణ శక్తిమంతమైన సీబీఐ అధికారిగా భిన్నకోణాల్లో నటిస్తున్నారు. నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు.

  Balakrishna's Lion Movie preview

  దర్శకుడు మాట్లాడుతూ... ''బాలకృష్ణ ఇప్పటిదాకా చేయనటువంటి కథ ఇది. ఇందులో ఆయన్ని గాడ్సే, బోస్‌ అనే రెండు పాత్రల్లో చూపించా. గాడ్సే అనే పేరుతో పాత్రని ఎందుకు సృష్టించామో తెరపైనే చూడాలి. 'లయన్‌' అన్న పేరు అభిమానుల నుంచి వచ్చిందే. తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ బాలకృష్ణ తీసుకొనే నిర్ణయాలు సాహసోపేతంగా ఉంటాయి. అందుకు 'లయన్‌' పేరు పెట్టాం. అలాగే సినిమాకోసం ఆయన తీసుకొన్న చొరవ ఆశ్చర్యం కలిగించింది. పాత్ర కోసం బరువు తగ్గాల్సి రావడంతో 4నెలలపాటు కేవలం ద్రవ పదార్థాలనే తీసుకొన్నారు. 8 కిలోలు బరువు తగ్గి సినిమాలో నటించారు. '' అని చెప్పారు.

  నిర్మాత మాట్లాడుతూ... ‘‘ ఫస్టాఫ్‌ అన్ని వర్గాల వారినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. సెకండాఫ్‌ మాస్‌ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. ఇందులోని ప్రతి సన్నివేశం, ప్రతి ఫైట్‌ డిఫరెంట్‌గా ఉంటాయి. బాలకృష్ణగారు ఇందులో రెండు ఛాయలున్న పాత్రను చేశారు. ఒకటి సీబీఐ ఆఫీసర్‌ అయితే, మరొకటి మాస్‌ను అమితంగా ఆకట్టుకునే కేరక్టర్‌. ఆయన రఫ్‌గా కనిపించే గెట్‌పకు అభిమానుల నుంచే కాకుండా, అందరి నుంచీ సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఆయన డైలాగ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నోటివెంట వచ్చే ప్రతి పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఈలలు వేయిస్తుంది. ఆయన చేసిన ట్రైబల్‌ ఫైట్‌ సినిమా మొత్తానికీ హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే క్లైమాక్స్‌ ఫైట్‌ చాలా బాగుంటుంది. ప్రకాశ్‌రాజ్‌ ఓ పవర్‌ఫుల్‌ రోల్‌ చేశారు. త్రిష, రాధికా ఆప్టే - ఇద్దరూ తమ అందచందాలతో, అభినయంతో ఆకట్టుకుంటారు.'' అన్నారు.

  బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా
  నటీనటులు: బాలకృష్ణ, త్రిష , రాధికాఆప్టే, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు
  సంగీతం: మణిశర్మ,
  ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌,
  ఎడిటర్: గౌతంరాజు
  ఫైట్స్ :రామ్-లక్ష్మణ్
  నిర్మాత: రుద్రపాటి రమణారావు
  నిర్మాణ సారథ్యం: రుద్రపాటి ప్రేమలత
  సమర్పణ: జివ్వాజి రామాంజనేయులు
  కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సత్యదేవ్
  విడుదల తేదీ: 14 మే, 2015.

  English summary
  "Lion" is touted as a commercial film with a nice blend of action, entertainment and family sentiments. Nandamuri Balakrishna will be seen in two different roles in the movie, which has been directed by Satya Deva and produced by Rudrapati Ramana Rao under the banner SLV Cinema.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X