For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలకృష్ణ తొడపై త్రిష చెయ్యేసి నొక్కుతూ... (వీడియో)

  By Srikanya
  |

  హైదరాబాద్: బాలకృష్ణ, త్రిష కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'లయన్'. ఈ చిత్రంలో భాగంగా...షూట్ చేసి ట్రైలర్ గా వదిలిన ..త్రిష, బాలయ్య ల మధ్య రొమాన్స్ హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా... బాలకృష్ణ సినిమాలు అంటే భారీ యాక్షన్ సీన్లు, పవర్ ఫుల్ డైలాగ్స్ మాత్రమే ఉంటాయని అందరు భావిస్తారు. కానీ తన అప్ కామింగ్ మూవీ 'లయన్' లో వీటితో పాటు రొమాన్స్ ని ఇష్టపడే ప్రేక్షేకుల కోసం కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా జత చేసాడట దర్శకుడు సత్యదేవ్. మీరూ ఓ లుక్కేయండి బాలయ్యలో రొమాంటిక్ యాంగిల్ పై......

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  అంతే కాక రొమాంటిక్ సీన్లు ఊహకందని రేంజ్ లో ఉన్నాయని ఆ సీన్స్ లలో త్రిష - బాలయ్య పోటాపోటిగా నటించారని ఆ సన్నివేశాలను చూసి బాలయ్య అబిమానులు ఎంజాయ్ చేయడం ఖాయం అని అంటున్నారు చిత్ర యూనిట్. బాలకృష్ణ , త్రిష , రాధిక ఆప్టే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్నాడు. మణిశర్మ అందించిన పాటలకు మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది.

  నందమూరి బాలకృష్ణ శక్తిమంతమైన సీబీఐ అధికారిగా భిన్నకోణాల్లో నటిస్తున్నారు. సత్యదేవ్ దర్శకునిగా పరిచయమవుతోన్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు.

  Balakrishna's Lion Movie Romantic Trailer

  బిజినెస్ విషయానికి వస్తే...

  ఇక ఈ చిత్ర డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే.. ఏ చిత్రానికి అయిన నైజం ఏరియా కలెక్షన్స్ బాగా ప్రదానం. అలాంటిది బాలకృష్ణ విషయనికి వస్తే గత చిత్రాలు అయిన సింహ, లెజెండ్ రెండు చిత్రాలు కూడా నైజంలో అంతగా వసులు చేయకపోవడం తో, ఇప్పుడు లయన్ చిత్ర రైట్స్ తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రాకపోవడం తో చివరికి దిల్ రాజు తీసుకోవడానికి ముందుకు వచ్చాడని ఫిల్మ్ నగర్ టాక్. దిల్ రాజు ఓ సినిమా ని డిస్ట్రిబ్యూషన్ చేస్తునాడు అంటే ఆ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఇండస్ట్రీ లో ఉంది. మరి లయన్ చిత్రం ఎంతవరకు దిల్ రాజు కు కలిసి వస్తుందో చూడాలి అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

  నిర్మాత మాట్లాడుతూ.... ఈ సినిమాలో బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా, సామాన్యుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా అభిమానులను అలరించే అన్ని అంశాలతో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు.

  Balakrishna's Lion Movie Romantic Trailer

  కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి. అటు రాజకీయంగా, ఇటు సినిమాపరంగా వరుస విజయాలు సాధిస్తూ ఊపుమీదున్న బాలకృష్ణ ఎంతో ఉత్సాహంతో ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బాలకృష్ణ గతంలో నటించిన ‘సీతారామకల్యాణం', ‘బొబ్బిలిసింహం', ‘తల్లిదండ్రులు' చిత్రాల తరహాలో మంచి హిట్ కొట్టబోతున్నామని నిర్మాత చెప్తున్నారు.

  బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు

  English summary
  Lion is getting ready to roar at BO and makers have released a new trailer from the film. The trailer was aimed to show romantic angle of the film it was eventually backfired. Its known that Balayya romancing with Trisha in the film and the new teaser shows romantic discussion between them.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X