అదిరింది : బాలకృష్ణ కొత్త చిత్రం గెటప్ (ఫొటో)

By Srikanya

హైదరాబాద్ : ఇటీవలే ‘లెజెండ్'తో మంచి హిట్ అందుకున్న బాలయ్య లేటెస్ట్‌గా మరో పవర్‌ఫుల్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్‌కోసం అన్వేషణ జరుగుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సీబీఐ ఆఫీసర్ గా చేస్తున్నారు. బాలకృష్ణ, త్రిష జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా సత్యదేవ్ దర్శకుడు గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ గెటప్ ఎలా ఉండనుంది అంటే..మీరు ఇప్పుడు చూస్తున్నదే. షూటింగ్ స్పాట్ లో అభిమానులను కలిసినప్పటి ఫొటో ఇది. బాలకృష్ణ 98 వ చిత్రం ఇది.

ఇక ఈ చిత్రానికి గాడ్సే అనే పేరు పెడదామనుకొన్నారు. కానీ నెగిటివ్ టచ్ ఎక్కువగా కనిపించడంతో ఆ ఆలోచన మార్చుకొన్నారు. ఇప్పుడు మరో పేరు పరిశీలనలోకి వచ్చింది. అదే.. వారియర్. ఈ పేరైతే బాలయ్య ఇమేజ్‌కీ, కథకీ అనుగుణంగా ఉంటుందని చిత్ర బృందం భావిస్తోందట. అయితే ఇంగ్లీష్ పేరు కాకుండా తెలుగు పేరు ఉంటే చూడండి అని బాలయ్య సలహా ఇచ్చారట. దాంతో తెలుగు టైటిల్‌కోసం చూస్తున్నారు. దొరికితే ఓకే... లేదంటే బాలయ్య సినిమాకి వారియర్
టైటిల్ పెట్టే అవకాశం ఉంది మరి.

Balakrishna's Look in his 98th Film!

రుద్రపాటి రమణారావు నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. వీటికి రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వం వహిస్తున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే యాక్షన్‌ ఎపిసోడ్‌ తెరకెక్కిస్తారు. ఆ తరవాత వారం రోజుల పాటు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ సాగుతుంది. ఈ చిత్రంలో బాలయ్యలో రెండు కోణాలుంటాయని తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

''ప్రజల క్షేమాన్ని కోరుకునే ఓ ఉన్నత ఉద్యోగి జీవితమిది. నాయకుడంటే ఇలా ఉండాలనేలా బాలకృష్ణ పాత్రను సత్యదేవా తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి'' అంటున్నారు నిర్మాత.

ఈ చిత్రంలో బాలకృష్ణ సీబీఐ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు. కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి.

ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకట్‌ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X