ఎమ్మెల్యేగా బాలకృష్ణ తొలి సినిమా ప్రారంభం (ఫోటోలు)
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. సత్యదేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని రుద్రపాటి ప్రేమలతా సమర్పణలో రుద్రపాటి రామారావు ఎస్ఎల్‌వి బేనర్లో నిర్మిస్తున్నారు. సోమవారం రామానాయుడు స్టూడియోలో సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
ఎస్ ఎల్ వి బేనర్లో ప్రొడక్షన్ 3గా తెరకెక్కుతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవానికి దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, బి గోపాల్, బోయపాటి శ్రీను, అంబిక కృష్ణ తదితరులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా రాఘవేంద్రరావు కెమెరా స్విచాన్ చేసారు.
చిత్ర ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో....

తొలి చిత్రం
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయిన తర్వాత బాలయ్య నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.

98వ చిత్రం
లెజెండ్ విజయోత్సాహంలో ఉన్న బాలయ్య అదే జోరు మీద కొత్త దర్శకుడు సత్యదేవ దర్శకత్వంలో తన కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది బాలయ్య 98వ చిత్రం.

త్రిష హీరోయిన్
ఈ సినిమాలో బాలయ్య సరసన త్రిష హీరోయిన్గా నటించబోతోంది. తొలిసారిగా త్రిష బాలకృష్ణతో నటించనుంది.

బాలయ్యతో నటించడంపై త్రిష ట్వీట్
ఈ సినిమాలో త్రిష నటించడం ఖరారైన తరువాత, బాలకృష్ణతో నటించడం తనకెంతో సంతోషంగా ఉందని ఆమె ట్విట్ చేశారు. అంతేకాకుండా బాలయ్య సరసన తొలిసారిగా నటించడం తనకు ఆనందం కలిగిస్తోందని తెలిపారు.

అజంలి కూడా
ఈ సినిమాలో త్రిషతోపాటు మరో హీరోయిన్గా అంజలి నటిస్తోంది.

యాక్షన్, ఎంటర్టైనర్
పూర్తి యాక్షన్, ఎంటర్టైనర్‌గా బాలయ్య మార్కు డైలాగులు, సన్నివేశాలతో సినిమా ఉంటుంది.

రెగ్యులర్ షూటింగ్
బాలకృష్ణ చాలా పవర్ఫుల్ పాత్ర పోషించే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మాత్రం తన పుట్టిన రోజు జూన్ పది నుంచి మొదలు పెడతారు.

టైటిల్....
ఈ చిత్రానికి 'గాడ్సే' అనే పేరు ఖరారు చేసినట్లు సినీవర్గాల సమాచారం.

సంగీతం..
ఈ చిత్రానికి ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తారు.


Click it and Unblock the Notifications











