»   » బాలయ్య కొత్త పేరు, ఇకపై అలానే పిలవాలన్న నటసింహం!

బాలయ్య కొత్త పేరు, ఇకపై అలానే పిలవాలన్న నటసింహం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ తన కొత్త పేరును ప్రకటించారు. తనను బాలకృష్ణ అని కాకుండా.... 'బసవ తారకరామ పుత్ర బాలకృష్ణ' అని పిలవాలని ఆయన సూచించారు. ఆయన నటించిన చారిత్రక చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా విడుదల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం.

జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం జనవరి 12న సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలవుతోంది. తెలుగు జాతి చరిత్రను చాటి చెప్పే సినిమా కావడంతో ఈ సినిమా పన్ను మినహాయింపు కోసం బాలయ్య రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులను కలుస్తున్నారు.

శాతవాహన మహారాజు "శాతకర్ణి" జీవితం ఆధారంగా క్రిష్ తెరకెక్కించిన హిస్టారికల్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై బిబో శ్రీనివాస్ సమర్పణలో వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు నిర్మించారు.

 Balakrishna's new name 'Basava Taraka Rama Putra Balakrishna'

బాలకృష్ణ సరసన శ్రేయ "వశిష్ట మహాదేవి"గా ముఖ్యభూమిక పోషించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటీమణి హేమమాలిని శాతకర్ణుడి వీరమాత "గౌతమి"గా ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. జనవరి 5న "గౌతమీపుత్ర శాతకర్ణి" చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు సింగిల్ కట్ కూడా లేకుండా "యు/ఎ" సెర్టిఫికేట్ ఇచ్చారు.

శాలివాహన శకం నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్రిష్ ఓ దృశ్యకావ్యంలా తెరకెక్కించారని, సినిమా చూస్తున్నంతసేపు గౌతమిపుత్ర శాతకర్ణుడిగా నందమూరి నటసింహం బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని సెన్సార్ సభ్యులు క్రిష్ అండ్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

English summary
Balakrishna's new name 'Basava Taraka Rama Putra Balakrishna'. Nandamuri Balakrishna is an Indian film actor and politician, often cited as "Balayya", is known for his works predominantly in the Telugu cinema.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu