ఎన్టీఆర్ బయోపిక్ బడ్జెట్ ఎంతో తెలుసా? బాలకృష్ణ కెరీర్‌లోనే..

By Rajababu

మహానటి చిత్ర విజయం తర్వాత టాలీవుడ్‌లో బయోపిక్‌ చిత్రాల నిర్మాణం జోరందుకున్నది. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ఇటీవల ఆరంభమైంది. ఎన్టీఆర్ బయోపిక్ ఆరంభానికి ముందు అనుకొన్న బడ్జెట్, ఇతర అంశాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకొన్నట్టు సినీవర్గాల సమాచారం.

Recommended Video

Rana Daggubati To Play Nara Chandrababu Naidu Role In NTR Biopic
50 కోట్లతో ఎన్టీఆర్ బయోపిక్

50 కోట్లతో ఎన్టీఆర్ బయోపిక్

ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ నిర్ణయం తీసుకొన్నారు. ఈ చిత్రాన్ని సుమారు రూ.50 కోట్ల వ్యయంతో రూపొందనున్నది. పలు రకాల గెటప్స్‌లో బాలకృష్ణ కనిపించనున్నారు. ఏఎన్నార్‌గా నాగ చైతన్య మరోసారి మెరువనున్నారు.

బాలకృష్ణ కెరీర్‌లోనే

బాలకృష్ణ కెరీర్‌లోనే

ఇప్పటి వరకు సుమారు 25, 30 కోట్ల రూపాయలతో బాలకృష్ణ సినిమాలు రూపొందేవి. కానీ ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం రూ.50 కోట్ల వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. ఈ వ్యయం బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధికం. ఇటీవలనే ఒపెనింగ్ సీన్‌ను హైదరాబాద్ రామకృష్ణ సినీ స్టూడియోలో చిత్రీకరించారు.

తెలుగు, తమిళ, హిందీలో

తెలుగు, తమిళ, హిందీలో

ఎన్టీఆర్ బయోపిక్‌ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్టీఆర్‌కు ప్రజాదరణ ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని 2019 సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

బసవతారకంగా విద్యాబాలన్

బసవతారకంగా విద్యాబాలన్

ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, తల్లి బసవతారకంగా విద్యాబాలన్ నటించనున్నారు. ఇటీవల విద్యాబాలన్ ఇంటికి వెళ్లి సినిమా విశిష్టతను చెప్పి ఆమెను బాలకృష్ణ ఒప్పించినట్టు వార్తలు వచ్చాయి. నారా చంద్రబాబునాయుడు పాత్రలో రానా దగ్గుబాటి నటించనున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X