'ఎన్టీఆర్ కథానాయకుడు'కు భారీ షాక్.. దెబ్బేసింది ఆ సంస్థే, సినిమా మొత్తం!

నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాని బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నడుమ విడుదలైంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి తొలి షో నుంచే మంచి రెస్పాన్స్ మొదలైంది. బాలయ్య నటన, క్రిష్ దర్శత్వం, బుర్రా సాయిమాధవ్ అందించిన డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలైన కొన్ని గంటలోపే భారీ షాక్ తగిలింది. అన్ని భారీ చిత్రాలు తరహాలోనే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం పైరసీకి గురైంది.

బాలయ్య జీవించాడు

బాలయ్య జీవించాడు

తండ్రి పాత్రలో బాలకృష్ణ జీవించాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. బసవతారకం పాత్రలో విద్యాబాలన్, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటనకు కూడా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా దివిసీమ ఉప్పెన, రాజకీయ పార్టీని ప్రకటించే కీలక సన్నివేశాల్లో బాలయ్య అద్భుతంగా నటించాడు. ఎన్టీఆర్ ఐకానిక్ రోల్స్ గా చెప్పబడే శ్రీకృష్ణుడు, రావణబ్రహ్మ లాంటి పౌరాణిక పాత్రలో బాలయ్య ఒదిగిపోయాడు. అభిమానుల నుంచి వస్తున్న స్పందనతో జోష్ లో ఉన్న చిత్ర యూనిట్ కు ఎదురుదెబ్బ తగిలింది.

మళ్ళీ అదే సంస్థ

మళ్ళీ అదే సంస్థ

చిత్ర పరిశ్రమకు తమిళ్ రాకర్స్ సంస్థ పెను శాపంగా మారింది. భారీ చిత్రాలన్నింటికీ తొలి రోజే ఈ సంస్థ ఆన్లైన్ లో లీక్ చేస్తోంది. 2.0 లాంటి చిత్రాలనైతే విడుదలైన కొన్ని గంటల్లోనే లీక్ చేసింది. తాజాగా తమిళ్ రాకర్స్ పంజా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంపై కూడా పడింది. సినిమా మొత్తాన్ని ఈ సంస్థ లీక్ చేసినట్లు తెలుస్తోంది.

చర్యలు ప్రారంభం

చర్యలు ప్రారంభం

ఎన్టీఆర్ కథానాయకుడు చిత్ర యూనిట్ పైరసీ ప్రభావం నుంచి సినిమాని రక్షించడానికి వెంటనే చర్యలు ప్రారంభించారు. పైరసీ లింకులని తొలగించడానికి ఈ చిత్ర టీం ప్రయత్నిస్తోంది. పైరసీ లింకులు అంతటా వ్యాపించకుండా వేగంగా తొలగిస్తే కొంతవరకైనా నష్టాన్ని తగ్గించవచ్చు. ఇదిలా ఉండగా నేటి నుంచి ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి సంక్రాంతి పోటీ మొదలు కానుంది. నేడు రజని పేట చిత్రం, జనవరి 11న వినయ విధేయ రామ, 12న ఎఫ్2 చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

బాలయ్య కెరీర్‌లో హైయెస్ట్

బాలయ్య కెరీర్‌లో హైయెస్ట్

ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి తొలిరోజు మంచి ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం యూఎస్ లో గౌతమి పుత్ర శాతకర్ణి వసూళ్లు అధికమించి బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు ఏవిధంగా ఉన్నాయో తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X