twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఎన్టీఆర్ మహానాయకుడు' ట్రైలర్: పార్టీకి పెద్దాయన గ్లామర్.. నేను గ్రామర్.. విలన్ ఆయనే!

    |

    నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగం విడుదలైంది. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత చేపట్టిన ఎన్నికల ప్రచారం, ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన పరిణామాలని హైలైట్ చేశారు. మహానాయకుడులో రానా పాత్రకు, నాదేండ్ల భాస్కర రావు పాత్రకు మంచి ప్రాధాన్యత దక్కింది. ట్రైలర్ లోని విశేషాలు గమనిస్తే..

     ఇందిరాగాంధీ

    ఇందిరాగాంధీ

    ట్రైలర్ ప్రారంభం కాగానే ఎన్టీఆర్ ఎన్నికల ప్రచార రథానికి తుదిమెరుగులు దిద్దుతూ కనిపిస్తాడు. ఎన్టీఆర్ కటౌట్ చూసి నిజంగానే శ్రీకృష్ణుడు అని భావించిన ఇందిరా గాంధీ దండం పెడుతుంది. ఆయనే మన ప్రత్యర్థి మేడం అని ఆమెపక్కనున్న వ్యక్తి చెప్పక ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత పార్టీ ఆఫీస్ లో జరిగే చర్చ కార్యక్రమాలని చూపిస్తారు.

    నాదేండ్ల భాస్కరరావు పాత్ర

    నాదేండ్ల భాస్కరరావు పాత్ర

    ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక చేపట్టిన సంక్షేమ పథకాల్ని ట్రైలర్ లో చూపించారు. నాదెండ్ల భాస్కర రావు పాత్రలో నటిస్తున్న సచిన్ ఖేడ్కర్ కూడా ఎంటర్ అవుతారు. ఆయన పైలెట్ అయితే నేను కో పైలెట్.. అడ్మినిస్ట్రేషన్ కు ఆయన కొత్త కదా మీకు నేనున్నాను అని చెబుతున్న నాదెండ్ల డైలాగులు బావున్నాయి.

    రానా ఎంట్రీ

    పార్టీలో నాదెండ్ల ప్రమేయం ఎక్కువవుతున్న తరుణంలో చంద్రబాబు పాత్రలోని రానా ఎంటర్ అవుతాడు. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు మధ్య జరిగే ఆసక్తికర సంభాషణని ట్రైలర్ లో చూపించారు. చెప్పేటోళ్లు ఉండాలి. లేకుంటే 6 కోట్లమంది ఆయన పక్కన ఉన్నా ఒంటరి అయిపోతారు అని రానా చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. అప్పుడే నాదెండ్ల భాస్కరరావు రాజకీయాలు మొదలవుతాయి. ఢిల్లీ స్థాయిలో జరిగే రాజకీయాలని దర్శకుడు చూపించారు.

     పెద్దాయన గ్లామర్.. నేను గ్రామర్

    పెద్దాయన గ్లామర్.. నేను గ్రామర్

    పార్టీకి పెద్దాయన గ్లామర్.. నేను గ్రామర్ అంటూ నాదెండ్ల పార్టీలో ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తాడు. అతడిపై చంద్రబాబుకు వ్యతిరేకత ఉన్నాట్లుగా రానా పాత్రని చూపించారు. నిశ్శబ్దాన్ని చేతగాని తనం అనుకోవద్దు. మౌనం మారణాయుధం లాంటిది అంటూ బాలయ్య వార్నింగ్ ఇస్తూ కనిపిస్తాడు. పార్టీలో అంతర్గత కలహాలు మొదలైన తర్వాత చంద్రబాబు పాత్రని బాగా హైలైట్ చేసి ట్రబుల్ షూటర్ లా చూపించినట్లు తెలుస్తోంది. నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను అని బాలయ్య చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. మొత్తంగా ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో నాదెండ్ల భాస్కర రావు పాత్రని విలన్ గా చూపించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

    English summary
    Balakrishna's NTR Mahanayakudu Trailer released
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X