బాలయ్య చలనచిత్ర చరిత్రను తిరగరాసిన ‘సింహా’
నటసింహ బాలకృష్ణ, హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో యునైటెడ్ మూవీస్ పతాకంపై యువ నిర్మాత పరుచూరి కిరీటి నిర్మించిన 'సింహా" ఈ రోజుతో 100 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ... '78 ఏళ్ళ తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగరాసి అత్యధిక కేంద్రాల్లో కలెక్షన్లతో ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించి దిగ్విజయంగా శతదినోత్సవం జరుపుకుంటున్న ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ 'సింహా".
ఇంతటి అద్భుత విజయాన్ని మా సంస్థకు ఇచ్చిన మా హీరో బాలకృష్ణగారికి, దర్శకుడు బోయపాటి శ్రీనుగారికి, ఈ చిత్రానికి వర్క్ చేసిన టీమ్ అందరికీ శతదినోత్సవ సందర్భంగా మా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే అనితర సాధ్యమైన ఈ విజయాన్ని మాకు ఇచ్చిన ప్రేక్షకులకు, బాలకృష్ణగారి అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం" అన్నారు. 78 ఏళ్ల తెలుగు చలనచిత్ర చరిత్రలో 'సింహా" ఓ సరికొత్త రికార్డు సృష్టించినందుకు నందమూరి అభిమానులంతా ఎంతో ఉత్సాహంగా వున్నారు.


Click it and Unblock the Notifications











