For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిరంజీవిగారిని వాడుకున్నట్లు మామయ్యను ఇండస్ట్రీ వాడుకోలేదు: బాలయ్య అల్లుడు భరత్ కామెంట్

|

టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సినిమాలు చూస్తూ తాను పెరిగానని బాలయ్య అల్లుడు, టీడీపీ నేత భరత్ తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ నలుగురిలో ఒకరికి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తారు? అనే ప్రశ్నకు తాను అలా ఇవ్వలేనని, అందరి సినిమాలు అన్ని అన్ని సమయాల్లో తనకు నచ్చలేదని తెలిపారు. చిరంజీవిగారి ఇంద్ర అంటే ఇష్టం, నాగార్జునగారి మన్మధుడు, వెంకటేష్ గారు చేసిన నువ్వు నాకు నచ్చావ్, మా మామయ్యగారి సినిమాల్లో అప్పట్లో సమర సింహారెడ్డి, ఇపుడు గౌతమీ పుత్ర శాతకర్ణి అంటే ఇష్టం అని తెలిపారు.

జూ ఎన్టీఆర్ అవసరం లేదు, మేము పనికి రాకుండా ఏమీ లేము: బాలయ్య అల్లుడి కామెంట్

చిరంజీవిగారితో మామయ్యను కంపేర్ చేయలేం

చిరంజీవిగారితో మామయ్యను కంపేర్ చేయలేం

చిరంజీవికి, మా మామయ్య బాలకృష్ణ గారికి చాలా డిఫరెన్స్ ఉంది. చిరంజీవిగారు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు. మామయ్య ఎన్టీఆర్ గారి అబ్బాయిగా వచ్చారు. అందుకే వారిని కంపేర్ చేయలేమని... ఓ ప్రశ్నకు భరత్ సమాధానం ఇచ్చారు.

మామయ్య కొన్ని రోజులు అక్కడే స్ట్రక్ అయ్యారు

మామయ్య కొన్ని రోజులు అక్కడే స్ట్రక్ అయ్యారు

బాలకృష్ణ గారి విషయానికొస్తే.. ఎర్లీ 2000లో కొంత స్లాట్ అయ్యారని అనిపించింది. ఎక్కువ ఫ్యాక్షన్ సినిమాలు చేయడం, అదే రూట్లో వెళ్లి అందులోనే స్ట్రక్ అయిపోయారు. గత ఆరేడు ఏళ్లుగా అందులో నుంచి బయటకు వచ్చి రకరకాల రోల్స్ చేశారు. అయితే చిరంజీవిగారు ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు చేయకుండా రకరకాల పాత్రలు చేసుకుంటూ వెళ్లారు.

చిరంజీవిగారిని వాడుకున్నట్లు మామయ్యను ఇండస్ట్రీ వాడుకోలేదు

చిరంజీవిగారిని వాడుకున్నట్లు మామయ్యను ఇండస్ట్రీ వాడుకోలేదు

తెలుగు సినిమా ఇండస్ట్రీ చిరంజీవి గారిని వాడుకున్నంతగా బాలకృష్ణగారిని వాడుకోలేదని, బాలకృష్ణ గారికి ఇంకా స్కోప్ ఉంది. ఆయన వ్యాల్యూను ఇంకా ఇనుమడింప చేయవచ్చు. కానీ ఇండస్ట్రీ అలా చేయలేదు. డైరెక్టర్లు, స్క్రిప్టు రైటర్లు ఆయనకు ఇలాంటి ఇమేజ్ మాత్రమే సూటవుతుంది, ఇలాగే చేద్దాం, ఇలా చేయకుంటే ఆయనకు కోపం వస్తుంది అని ఏవో ఊహల్లో ఉండిపోయారేమో. నా ఆలోచన ప్రకారం ఆయనలో ఉన్న టాలెంటును సరిగా సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పటికీ కూడా కొత్త డైరెక్టర్లు కొత్త స్క్రిప్టుతో, మంచి ఐడియాస్ వస్తే ఆయన్ను ఇంకా కొత్తగా చూడగలం అని నేను అనుకుంటున్నాను.

రామ్ చరణ్, రానా అంతా మార్చేశారు

రామ్ చరణ్, రానా అంతా మార్చేశారు

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న స్టార్లలో చూస్తే... వాళ్ల నెక్ట్స్ జనరేషన్లో కల్చర్ మార్చారు. రామ్ చరణ్ వచ్చిన తర్వాత ప్రొఫెషనల్‌గా ఫ్రొడక్షన్ చేసి, స్క్రిప్టు వేరేగా చూసి, చిరంజీవిగారి కోసం కొత్తగా చేస్తున్నారు. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీలో రానా గారు వచ్చి కొత్తరకంగా ఆలోచించి, కొత్త టాలెంట్ మేనేజ్మెంటుతో అంతా కొత్తగా చేస్తున్నారు. మామయ్య విషయంలో ఆయన తర్వాత నెక్ట్స్ జనరేషన్లో ఎవరూ రాలేదు.

కెమెరా వెనక బాలకృష్ణ గారు చాలా ఫన్‌గా ఉంటారు

కెమెరా వెనక బాలకృష్ణ గారు చాలా ఫన్‌గా ఉంటారు

మాయ్యమకు ఏలాంటి పాత్ర అయితే బావుంటుంది అని అనలైజ్ చేసే పొటెన్షియల్ నాలో ఉంటే నేనే ఒక స్క్రిప్టు తయారు చేసేవాడిని, నాకు అలాంటి టాలెంట్ లేదు. అయితే మామయ్యలో వివిధ రకాల పాత్రలు చేసే పొటెన్షియల్ అయితే ఉందని చెప్పగలను. ఇపుడు ఉన్న డైరెక్టర్లు చాలా మందికి మంచి ఐడియాస్ ఉన్నాయి. కెమెరా వెనక బాలకృష్ణ గారు చాలా ఫన్‌గా ఉంటారు. అందరినీ నవ్విస్తారు. కొన్ని సార్లు ఎంతో రిలీజియస్‌గా, సీరియస్‌గా ఉంటారో.... అదే విధంగా అందరితో సరదాగా, కామెడీగా ఉంటారని భరత్ వ్యాఖ్యానించారు.

English summary
Balakrishna's son-in-law Bharat said not to compare Chiranjeevi and Balakrishna. Chiranjeevi came with no support and Balakrishna came with his father's support. Balakrishna has a lot of talent. We need to get it out, ”Bharat said.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more