twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ అవసరం లేదు, మేము పనికి రాకుండా ఏమీ లేము: బాలయ్య అల్లుడి కామెంట్

    |

    Recommended Video

    Balakrishna's Son-in-law Sensational Comments On Jr NTR || Filmibeat Telugu

    నందమూరి హరికృష్ణ ప్రథమ వర్ధంతి జరిగిన సమయంలో మాజీ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా వచ్చి జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌, కుటుంబ సభ్యులను పరామర్శించడం చర్చనీయాంశం అయింది. హరికృష్ణ జీవించి ఉన్న సమయంలో అంటీముట్టనట్టుగా ఉన్న చంద్రబాబు ఇపుడు జూ ఎన్టీఆర్‌ను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మీడియా కథనాలు వెలువడ్డాయి. బాలయ్య అల్లుడు, టీడీపీ నాయకుడు భరత్ ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై భరత్ నుంచి ఆసక్తికర సమాధానాలు వచ్చాయి.

    జూ ఎన్టీఆర్ రావాలంటే ఈ రెండు జరుగాలి

    జూ ఎన్టీఆర్ రావాలంటే ఈ రెండు జరుగాలి

    జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అనుచరులు సపరేటుగా ఉండటం కంటే పార్టీలో అంతర్భాగమై పని చేస్తేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందనేది టీడీపీ స్ట్రాంగ్ ఫాలోవర్స్ అభిప్రాయం. దీనితో మీకు కూడా ఏకీభవిస్తారా? అనే ప్రశ్నకు భరత్ స్పందిస్తూ... ‘‘నాకెప్పుడూ పార్టీ సుప్రీమ్. పార్టీ స్ట్రక్చర్, నాయకత్వమే శిరోధార్యం. ఆయన(జూ ఎన్టీఆర్) ఇన్‌ఫ్లూయెన్సియల్ ఫిగర్, బాగా మాట్లాడతారు, మంచి యాక్టర్, చాలా పాపులర్, చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఇవన్నీ పర్లేదు. మా పార్టీ స్ట్రక్చర్ ప్రకారం నాయకుడు(చంద్రబాబు) ఆలోచించి పలానా వ్యక్తి మన పార్టీలోకి రావాలని ఆయన అనుకోవడం, నేను రాజకీయాల్లోకి రావాలని ఆయన(జూ ఎన్టీఆర్) అనుకోవడం... ఈ రెండు జరిగితేనే విషయం ముందుకు వెళుతుంది'' అని అభిప్రాయ పడ్డారు.

    జూ ఎన్టీఆర్ రావాల్సిన అవసరం లేదు

    జూ ఎన్టీఆర్ రావాల్సిన అవసరం లేదు

    మీరు కూడా ఆ ఫ్యామిలీలో భాగం కాబట్టి, టీడీపీ యువ నాయుకుడు కాబట్టి ఓ విషయం అడుగుతున్నాం. టీడీపీలోకి జూ ఎన్టీఆర్ రావాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? అనే ప్రశ్నకు భరత్ స్పందస్తూ.... ‘నేను అలా అనుకోవడం లేదు' అని స్పష్టం చేశారు.

    మేము పనికిరాకుండా ఏమీ లేము

    మేము పనికిరాకుండా ఏమీ లేము

    ‘‘జూ ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదనే అనుకుంటున్నాం. ఆయన అవసరం ఏముంది? మేము బాగానే హ్యాండిల్ చేస్తున్నాం. అలాంటపుడు ఆయన రావాలని ఎందుకు అనుకుంటాం. ఇప్పటిదాకా మేము నడిపిన పార్టీ, మాకు ఉన్న నాయకులు పనికిరాకుండా ఉన్నారా? అలాంటిదేమీ లేదుకదా''.... అంటూ భరత్ సమాధానం ఇచ్చారు.

    జూ ఎన్టీఆర్‌కు చరిష్మా, పాపులారిటీ, ఫ్యాన్స్ ఉన్నారు, కానీ...

    జూ ఎన్టీఆర్‌కు చరిష్మా, పాపులారిటీ, ఫ్యాన్స్ ఉన్నారు, కానీ...

    సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ టీడీపీ. మనవడిగా జూ ఎన్టీఆర్‌కు కూడా హక్కు ఉంటుంది కదా? ఆయన్ను కలుపుకుని పోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది కదా? అనే ప్రశ్నకు భరత్ స్పందిస్తూ... ఎన్టీఆర్ గారికి చాలా మంది పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. ఆయన(జూ ఎన్టీఆర్)కు చరిష్మా ఉంది, పాపులారిటీ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు వాటిని ఎవరూ క్వశ్చన్ చేయడం లేదు. ఆయనకు రాజకీయాల్లోకి రావాలనే ఇంట్రస్ట్ ఉందని ఆయన చెప్పినపుడు, మా నాయకుడు కూడా ఆయన పార్టీలోకి వస్తే బావుంటుందని భావించినపుడు.... తప్పకుండా ఆ ఇద్దరూ నిర్ణయం తీసుకుంటారు.

    జూ ఎన్టీఆర్ ఉంటేనే పార్టీ నడుస్తుందని అనుకోవడం లేదు

    జూ ఎన్టీఆర్ ఉంటేనే పార్టీ నడుస్తుందని అనుకోవడం లేదు

    నా వరకు అయితే ఆయన(జూ ఎన్టీఆర్) పార్టీకి అవసరం, ఆయన ఉంటేనే పార్టీ నడుస్తుంది అని అయితే నేను అనుకోను. నా కాన్ఫిడెంట్ ఏమిటంటే...ఇపుడున్న యువ నాయకులతో, కొత్త ఆలోచనతో కొత్త స్ట్రక్చ్ చేయగలిగితే మేము పార్టీని బిల్డ్ చేయగలం. సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చినపుడు ఆయనతో పాటు వచ్చిన వారంతా జూ ఎన్టీఆర్ లాంటి తెలిసిన వారు కారు కదండీ. ఆయన ఒక ఐడియాలజీతో వచ్చారు. అపుడు 294 మందిలో 200 మందికిపైగా 30 మందికంటే తక్కువ వయసు ఉన్నవారే... అని భరత్ స్పష్టం చేశారు.

    English summary
    Balakrishna's son-in-law Bharat said he did not think the Telugu Desam Party needed the Junior NTR. Bharat believes that the party does not think that it is running only if there is a junior NTR. He added that the existing leaders have the ability to lead the party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X