‘మోక్షజ్ఞ’ ఎంట్రీ వివరాలు చెప్పిన బాలయ్య
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ..హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య మాత్రం మావాడికి ఇప్పుడే ఇంకా హీరో అయ్యే వయసు రాలేదు, మరికొంత కాలంగా ఆగాల్సిందే అంటూ.....మోక్షజ్ఞ టాపిక్ దాట వేస్తూ వస్తున్నారు.
తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ వివరాలను బాలయ్య స్వయంగా వెల్లడించారు. ఇప్పుడే మావాడు నటనలో ఓనమాలు దిద్దుతున్నాడని, నటనా రంగంలో పూర్తి స్థాయి పరిక్వత పొందడానికి మరికొంత కాలం సమయం పడుతుందన్నారు. తన వారసుడిగా మోక్షజ్ఞ తెరంగ్రేటం చేయడానికి మరో ఐదేళ్ల సమయం పడుతుందని శుక్రవారం స్పష్టం చేశారు.
శ్రీరామ రాజ్యం సినిమా ప్రమోషన్లో పాల్గొన్న బాలయ్య ఈ విషయం స్పష్టం చేశారు. ఏది ఏమైనా బాలయ్య తనయుడు ఎంట్రీ వివరాలను ఖరారు కావడంతో నందమూరి అభిమానుల్లో ఆనందం నెలకొంది.


Click it and Unblock the Notifications











