twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మలేషియాలో భామలతో మజా చేయనున్న బాలయ్య!

    By Bojja Kumar
    |

    'బాలకృష్ణ నటిస్తున్న అడ్వెంచరస్ థ్రిల్లర్ 'శ్రీమన్నారాయణ'. ఆయన స్టైల్లో వుంటూనే ఆయన్ని కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ మలేషియాలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మలేషియాలోని అందమైన బీచ్‌లలో బాలయ్య, ఇషా చావ్లాలపై ఓ పాటను చిత్రీకరించడంతో పాటు...కొన్నేటాకీ సన్నివేశాలు కూడా ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు.


    అంతకంటే ముందు యూరఫ్‌లో పెండిగులో ఉన్న సాంగులను కంప్లీట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు క్లాస్‌ను, ఇటు మాస్‌ను అలరించే అంశాలన్నీ వున్నాయిందులో' అన్నారు దర్శకుడు రవికుమార్ చావలి. ఇందులో పార్వతీమెల్టన్, ఇషాచావ్లా కథానాయికలు. ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

    ఆ మధ్య నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'బాలకృష్ణను కొత్త పంథాలో చూపించే చిత్రమిది. విభిన్నమైన కథ, కథనాలతో సాగే ఈ చిత్రం బాలకృష్ణ అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇటీవలే బాలకృష్ణ, పార్వతీమెల్టన్, ఇషాచావ్లాపై పద్మాలయా స్టూడియోస్‌లో ఓ హుషాత్తించే గీతాన్ని చిత్రీకరించాం. చక్రి చక్కని సంగీతాన్ని అందించాడు. పాటలన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి. యూరప్‌లో మూడు పాటలు చిత్రీకరణ తర్వాత ఆ తర్వాత మలేషియాలో చిత్రీకరించే ఫైట్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది' అన్నారు.

    విజయ్‌కుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయవూపకాష్‌డ్డి, కృష్ణభగవాన్, ఆహుతివూపసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. నారాయణ, రాజా రవీంద్ర, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, మాటలు: పోలూర్ ఘటికాచలం, కెమెరా: టి. సురేందర్‌డ్డి, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, నిర్మాత: రమేష్‌పుప్పాల, కథ-కథనం-దర్శకత్వం: రవికుమార్ చావలి.

    English summary
    The shooting of 'Natasimha' Nandamuri Balakrishna's upcoming film "Srimannarayana" is currently progressing briskly in Malaysia. Director Ravi Chavali is filming a song on Balayya and Isha Chawla in the exotic and beautiful beaches of Malaysia. The unit is also expected to film a few talkie part scenes on Balayya and other cast in this schedule before leaving to Europe to shoot another duet song. "Srimannarayana" is billed to be a powerful action entertainer in which Balakrishna plays a rebellious journalist.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X