బాలకృష్ణ ఎడ్వంచరస్ థ్రిల్లర్
బాలకృష్ణ కథానాయకుడిగా రవి చావలి దర్శకత్వంలో 'శ్రీమన్నారాయణ' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అడ్వంచరస్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. ఈ చిత్రంలో వుండే ఆరుగురు ప్రతినాయకులకి, బాలకృష్ణకు మధ్య జరిగే పోరాటాలు ఆసక్తికరంగా వుంటాయి, ఆయన స్టయిల్‌లో వుంటూనే అటు క్లాస్‌ని, ఇటు మాస్‌ని అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే రీతిలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామన్నారు.
ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్ పతాకంపై రమేష్ పుప్పాల 'శ్రీమన్నారాయణ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ 'బాలకృష్ణ కెరీర్‌లో సంచలనాత్మకమైన చిత్రంగా 'శ్రీమన్నారాయణ'ను తీర్చిదిద్దుతున్నాం.
ఇటీవల పద్మాలయా స్టూడియోలో వేసిన సెట్‌లో బాలకృష్ణ, పార్వతి మెల్టన్, ఇషాచావ్లాలపై 'ఆరడుగుల అబ్బాయి.. హ్యాండ్‌సమ్ నువ్వోయి' అనే పాటను ఆరు రోజుల పాటు చిత్రీకరించాం. జూన్‌లో యూరప్‌లో మూడు పాటలు, మలేషియాలో ఓ ఫైట్ చిత్రీకరిస్తాం. దీంతో చిత్రీకరణ పూర్తవుతుంది' అన్నారు.
విజయ్‌కుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, ఎంఎస్ నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్ నాగినీడు, సుప్రీత్, సుధ, తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఘటికాచలం, కెమెరా: సురేందర్ రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్ : నాగేందర్, కో డైరెక్టర్ : సురేష్ కుమార్, నిర్మాత : పుప్పాల రమేష్, కథ, కథనం, దర్శకత్వం : రవికుమార్ చావలి.


Click it and Unblock the Notifications











