బాలకృష్ణ కు ఇదే తొలిసారి
బాలకృష్ణ నటించిన సినిమా తమిళంలో విడుదల కావడం ఇదే తొలిసారి. బాలకృష్ణ, మంచుమనోజ్‌ల కలయికలో రూపొందుతున్న చిత్రం 'ఊ కొడతారా, ఉలిక్కిపడతారా' చిత్రాన్ని తమిళంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రంలో బాలయ్య అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణ-సోనూ సూద్ మధ్య జరిగే పోరాట సన్నివేశాలకు మనోజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని మనోజ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఈ చిత్రంలో మనోజ్ సరసన దీక్ష సేథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. శేఖర్ రాజా దర్వకత్వం వహిస్తుండగా, మంచు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై మంచు లక్ష్మి నిర్మిస్తున్నారు. బెబో శశి, సలీమ్ సులేమాన్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ నటించిన అధినాయకుడు చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఇందులో మూడు పాత్రల్లో బాలకృష్ణ కనిపించనున్నారు. అలాగే రవిచావలి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సనర్పించే చిత్రం కూడా బాలకృష్ణ హీరోగా రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











