For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Unstoppable: బాబుకు టీడీపీని ఎందుకిచ్చావ్ అన్న మోహన్ బాబు.. చిరును లాగుతూ బాలయ్య షాకింగ్ రియాక్షన్

  |

  ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని స్టార్‌గా ఎదిగిపోయారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలా దాదాపు నాలుగు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో సినిమాలు చేసిన ఆయన.. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తూ ఫిదా చేసేశారు. అలా హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు.

  ఇంత కాలం సినిమా రంగంలో అలరించిన బాలయ్య.. ఇప్పుడు ఓటీటీ సంస్థ కోసం టాక్ షోను చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోను నిర్వహకులు విడుదల చేశారు. దీనికి గెస్టుగా వచ్చిన మోహన్ బాబు బాలయ్యకు షాకిచ్చేలా మాట్లాడారు. ఆ విషయాలు మీకోసం!

  హిట్ అందుకోలేకపోయిన బాలయ్య

  హిట్ అందుకోలేకపోయిన బాలయ్య

  'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత ఒక్క హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేదు నందమూరి బాలకృష్ణ. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నప్పటికీ.. విజయం మాత్రం అందనంత దూరంలోనే ఉంటోంది. దీంతో బాలయ్యతో పాటు ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉండిపోయారు. ఈ పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు.

  Bigg Boss: షో చరిత్రలో ఇలా జరగడం తొలిసారి.. టాప్ కంటెస్టెంట్ చెత్త రికార్డు.. ఆమె వల్లే ఇలా!

  ‘అఖండ'గా రాబోతున్న బాలకృష్ణ

  ‘అఖండ'గా రాబోతున్న బాలకృష్ణ

  వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న చిత్రమే 'అఖండ'. దీన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ ఇందులో హీరోయిన్‌. పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తోంది. శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం ఇస్తున్నాడు.

  అందరినీ లైన్‌లో పెట్టుకున్న సింహా

  అందరినీ లైన్‌లో పెట్టుకున్న సింహా

  'అఖండ' మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే నందమూరి బాలకృష్ణ ఎన్నో చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేనితో చేయబోయే సినిమాను ప్రకటించారు. దీని తర్వాత బాలయ్య.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమాను చేయనున్నారు. వీటి తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ఒక సినిమా.. శ్రీవాస్‌తో మరో సినిమాను చేస్తారని టాక్.

  Puneeth Rajkumar: బాలకృష్ణకు పునీత్ సహాయం.. స్టార్ అయినా ఆయన కోసం చిన్న పిల్లాడిలా.. వీడియో వైరల్

  అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకేతో ఎంట్రీ

  అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకేతో ఎంట్రీ

  నందమూరి బాలకృష్ణ లేటు వయసులో ప్రయోగాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'Unstoppable with NBK' అనే టాక్ షోతో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అల్లు అరవింద్‌కు చెందిన ఆహా సంస్థ రూపొందిస్తోన్న ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు గురువారమే వెల్లడించారు. అలాగే, దీన్ని అధికారికంగా ప్రారంభించారు.

  ప్రోమోతో అంచనాలు పెంచేశారుగా

  ప్రోమోతో అంచనాలు పెంచేశారుగా

  నటసింహా నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసే 'Unstoppable with NBK' టాక్ షోను దీపావళి కానుకగా నవంబర్ నాలుగు నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే బాలయ్యను పరిచయం చేస్తూ ప్రోమోను విడుదల చేశారు. దీంతో ఈ షోపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. దీనిపై ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు.. అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

  Bigg Boss Unseen: శృతి మించిన ప్రియాంక రొమాన్స్.. బయటే అతడితో పడుకుని.. వామ్మో మరీ దారుణం

  బాబుకు పార్టీని ఎందుకు ఇచ్చావు?

  'Unstoppable with NBK' ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. దీనికి మంచు మోహన్ బాబు, విష్ణు, లక్ష్మిలు వచ్చారు. ఇందులో బాలయ్య తనదైన శైలి డైలాగులతో అలరించారు. ఇక, ఈ ప్రోమోలో బాలయ్యను 'ఎన్టీఆర్ పెట్టిన పార్టీ పగ్గాలు నువ్వు తీసుకోకుండా చంద్రబాబుకు ఎందుకు అందించావు' అంటూ సూటిగా ప్రశ్నించారు మోహన్ బాబు.

  Recommended Video

  Natyam Movie Review By Nandamuri Balakrishna
  చిరంజీవిపై మీ అభిప్రాయం ఏంటి

  చిరంజీవిపై మీ అభిప్రాయం ఏంటి

  మోహన్ బాబు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూనే.. 'మరి మీ అన్నగారి పార్టీని వీడి వేరే పార్టీలో ఎందుకు చేరారు' అంటూ బాలయ్య షాకింగ్‌గా రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత 'చిరంజీవిపై మీ మనుసులో ఉన్న అభిప్రాయం ఏంటి' అని ప్రశ్నించారు బాలయ్య. అనంతరం మోహన్ బాబు 'అరవిందే నీతో ఈ ప్రశ్నలు అడిగిస్తున్నాడు' అంటూ కామెంట్ చేశారు.

  English summary
  Tollywood Star Hero Nandamuri Balakrishna Now Doing Unstoppable with NBK Show For Aha Video. Now This Talk Show 1st Episode Promo Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X