Unstoppable Promo: దెబ్బకు థింకింగ్ మారిపోవాల.. ఛాలెంజింగ్ వీడియోతో బాలయ్య సర్‌ప్రైజ్
దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభంలోనే తన సత్తాను నిరూపించుకున్న ఆయన.. అప్పటి నుంచి విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఏ పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేస్తూ ఫిదా చేసేశారు. అలా హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇంత కాలం సినిమా రంగంలో అలరించిన బాలయ్య.. ఇప్పుడు ఓటీటీ సంస్థ కోసం టాక్ షోను చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను నిర్వహకులు విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం దానిపై మీరూ ఓ లుక్కేయండి!

వరుస పరాజయాలతో సతమతం
కొంత కాలంగా ఒక్క హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయారు నటసింహా నందమూరి బాలకృష్ణ. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నప్పటికీ.. విజయం మాత్రం అందనంత దూరంలోనే ఉంటోంది. దీంతో బాలయ్యతో పాటు ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను అందుకోవాలి పట్టుదలతో ఉన్నారు.

‘అఖండ’గా వస్తున్న బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే 'అఖండ'. ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తోంది. శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

వరుస సినిమాలతో యమ జోష్‌లో
'అఖండ' మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే నందమూరి బాలకృష్ణ ఎన్నో చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేనితో చేయబోయే సినిమాను ప్రకటించారు. దీని తర్వాత బాలయ్య.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమాను చేయనున్నారు. వీటి తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ఒక సినిమా.. శ్రీవాస్‌తో మరో సినిమాను చేస్తారని టాక్.

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అని
నందమూరి బాలకృష్ణ లేటు వయసులో ప్రయోగాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'Unstoppable with NBK' అనే టాక్ షోతో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అల్లు అరవింద్‌కు చెందిన ఆహా సంస్థ రూపొందిస్తోన్న ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు గురువారమే వెల్లడించారు. అలాగే, అధికారికంగా లాంచ్ చేశారు.

ప్రోమోను విడుదల చేసిన ఆహా
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేయబోతున్న 'Unstoppable with NBK' టాక్ షోను దీపావళి కానుకగా నవంబర్ నాలుగు నుంచి ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌కు మంచు మోహన్ బాబు రాబోతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది.

స్టైలిష్‌గా బాలయ్య.. ఫ్యాన్స్ హ్యాపీ
'Unstoppable with NBK' ప్రోమోను ఆహా ఓటీటీ సంస్థ కొద్ది సేపటి క్రితమే విడుదల చేసింది. ఎన్నో అంచనాలతో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ వీడియోను ఎంతో స్టైలిష్‌గా రూపొందించారు. ఇందులో నటసింహా నందమూరి బాలకృష్ణ బైక్, కారు నడపడంతో పాటు గుర్రం స్వారీ చేస్తూ కనిపించారు. అంతేకాదు, ఆయన గెటప్ కూడా అదిరిపోయేలా ఉంది.
Recommended Video
సై అంటే సై.. నై అంటే నై అని
'Unstoppable with NBK' ప్రోమోలో నందమూరి బాలకృష్ణ డైలాగులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. 'నీకు లక్ష్య శుద్ధి ఉన్నప్పుడు.. నీకు సంకల్ప శుద్ధి ఉన్నప్పుడు.. నిన్ను పంచభూతాలు కూడా ఆపలేవు. మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు.. సై అంటే సై.. నై అంటే నై.. ఓన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాల' అని డైలాగ్ విసిరారు.


Click it and Unblock the Notifications











