బాలకృష్ణ కొత్త చిత్రం ఈ నెలాఖరుకే రిలీజ్

By Srikanya

మంచు ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మించే చిత్రం 'ఊ... కొడతారా..!? ఉలిక్కిపడతారా..!?'. బాలకృష్ణ కీ రోల్ చేస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెలాఖరుకు విడుదల కావడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మంచు లక్ష్మి మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత మల్టీ స్టారర్ చిత్రంగా నిర్మితమైన ఈ చిత్రంలో బాలకృష్ణ చేసిన పాత్రకు హైవోల్టేజ్ రెస్పాన్స్ వస్తుందని, అలాగే మనోజ్ కూడా స్టార్ హీరోగా ఎదుగుతాడని ఆమె తెలిపారు.

గుడ్ సినిమాల దారివేరు. యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాల దారి వేరు. కానీ ఈ రెండూ ఈ చిత్రానికి తోడై ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులు ఆనందిస్తారని, ఓ మంచి చిత్రాన్ని నిర్మించానన్న ఆనందం అందరి ఆదరణ చూస్తే తెలుస్తోందని, ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, ఈ నెలాఖరి వారంలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా బాలకృష్ణ జన్మదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆమె వివరించారు.

చిత్రం కోసం బాలయ్య ఈ అవతారమెత్తనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా శేఖర్ రాజా దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ చిత్రం కోసం దాదాపు మూడున్నర కోట్లతో మణికొండలో ఓ సెట్ నిర్మిస్తున్నారు. ఇక ఈ పాత్ర దాదాపు ముఫ్పై నిముషాల పాటు ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో లక్ష్మి ప్రసన్న కూడా ఓ కీలకమైన పాత్రను పోషించనుంది.ప్రస్తుతం ఈ చిత్రం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో దీక్షాసేధ్ హీరోయిన్ గా చేస్తోంది.

బాలకృష్ణ, మనోజ్ ప్రధానపాత్రధారులుగా మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించిన చిత్రం 'ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా?'. శేఖర్‌రాజా దర్శకత్వంలో మంచు లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం దీక్షాసేథ్, లక్ష్మీప్రసన్న, సోనూసూద్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: బోబోశశి, నిర్మాత: మంచు లక్ష్మిప్రసన్న, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శేఖర్‌రాజా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X