హృతిక్ రోషన్ ను బీట్ చేసిన బాలయ్య!

By Bojja Kumar

హైదరాబాద్: హృతిక్ రోషన్ బాలీవుడ్ స్టార్ హీరో, బాలయ్య టాలీవుడ్ స్టార్ హీరో..... వీరిద్దరికీ సినిమాల పరంగా పోలికేంటి అనుకుంటున్నారా? వాస్తవానికి వీరి సినిమాలు, వారి వారి స్టార్ ఇమేజ్ పూర్తిగా విభిన్నం. అయితే ఇటీవల ఓ అంశంలో బాలయ్య మూవీ ఓ అంశంలో సత్తా చాటింది.

బాలయ్య హీరోగా ఆ మధ్య డిక్టేటర్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వక పోయినా... బుల్లితెరపై మాత్రం ఓ రేంజిలో అదరగొడుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన భారీ బడ్జెట్ హిస్టారికల్ మూవీ ' మొహంజోదారో'. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్ద డిజాస్టర్. వెండితెరపై మాత్రమే కాదు.. బుల్లితెరపై కూడా ఈ సినిమా ఆశించిన రేటింగ్ రాలేదు.

Balakrishna's Yudh Ek Jung Beats Hrithik Roshan’s Mohenjo Daro

మొహంజోదారో వరల్డ్ ప్రీమియర్ స్టార్ గోల్డ్ ఛానల్ లో దసరా సందర్భంగా అక్టోబర్ 9న టెలికాస్ట్ అయింది. ఈ సినిమాకు టీవీ రేటింగ్ ప్రకారం కేవలం 1511 పాయింట్ల రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇదే వారంలో బాలయ్య నటించిన డిక్టేటర్ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ 'యుద్ ఏక్ జంగ్' పేరుతో రిష్టీ సినీప్లెక్స్ ఛానల్ లో టెలికాస్ట్ అయింది. ఈ సినిమాకు ఏకంగా 1649 పాయింట్ల రేటింగ్ వచ్చింది. ఈ విషయంలో బాలయ్య బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ను బీట్ చేసాడు. అంతే కాదు... ఆ వీక్ టీవీ రేటింగుల్లో బాలయ్య సినిమానే టాప్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X