బాలకృష్ణ అంత మాట అన్నాక ఎన్టీఆర్ ఇంకేం వస్తాడు?

బాలకృష్ణ మాట్లాడుతూ... 'జూనియర్ ఎన్టీఆర్ ఈ దఫా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడం ఆయన వ్యక్తిగతం. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ విజయానికి పాటుపడడం ఆయన కుటుంబ సభ్యులందరి బాధ్యత, కర్తవ్యం. ఎవరినీ బొట్టుపెట్టి పిలవాల్సిన అవసరం ఉండదు. అయినా, జూనియర్ అవసరం ప్రస్తుతం పార్టీకి లేదు.' అని సినీనటుడు,టీడీపీ నేత బాలకృష్ణ తేల్చి చెప్పారు.
అలాగే జూనియర్ ఎన్టీఆర్‌కు, తనకు అభిమానులు ఒక్కరే అని, ఇందులో ఎలాంటి భేషజాలు లేవని నందమూరి బాలకృష్ణ తెలపటం అంతటా చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాలయ్య మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలియచేసారు. దాంతో నందమూరి కుటుంబ అభిమానులే జూ.ఎన్టీఆర్ అభిమానులు అని తేల్చి చెప్పినట్లైంది.
అయితే ఎన్టీఆర్ ఈ విషయమై ఏమీ స్పందించలేదు. ఆయన ఈ ఎలక్షన్స్ కు దూరంగా ఉండి తన రభస చిత్రం షూటింగ్ లో పాల్గొంటారని చెప్పుకుంటున్నారు. ఈ విషయమై ఈ రోజు ఎన్టీఆర్ వైపు నుంచి ప్రకటన వచ్చే అవకాసం ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











