ఆ నలుగురే 'సింహా' సక్సెస్ కి..బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సింహా చిత్రం రికార్డు స్ధాయిలో విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ విషయం ప్రస్దావిస్తూ బాలకృష్ణ ఈ విజయం మొత్తం నలుగురు టెక్నీషియన్స్ కు చెందుతుందన్నారు. వారు దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు చక్రి, ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ లు అన్నారు. అలాగే వారే ఈ చిత్రానికి ఫిల్లర్స్ అని చెప్పుకొచ్చారు. సినిమా ఆడిందంటే నేనే కారణం..పోతే మిగతా టీమ్ అని హీరోలు భావించి మాట్లాడే ఈ రోజుల్లో బాలకృష్ణ వంటి స్టార్ హీరో అలా మాట్లాడటం ఆయనలోని ఉన్నత సంస్కారానికి నిదర్శనం అంటున్నారు.
సింహా బాలకృష్ణ బోయపాటి శ్రీను చక్రి నమిత నయనతార స్నేహా ఉల్లాల్ simha balakrishna boyapati srinu chakri namitha nayantara


Click it and Unblock the Notifications