మహేష్ ‘దూకుడు’కి బాలయ్య దసరా రేస్ నుండి అవుట్...!?
నందమూరి బాలకృష్ణ, శ్రీరాముడి పాత్రలో నటించిన తాజా చిత్రం 'శ్రీ రామ రాజ్యం". బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ మహేష్ హీరోగా నటించిన 'దూకుడు" చిత్రం దసరాకు విడుదలవుతున్న కారణంగా, 'శ్రీరామ రాజ్యం" చిత్రాన్ని దసరా తర్వాత విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యలమంచిలి సాయిబాబా నిర్మించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించింది ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విడుదల తేదిని త్వరలోనే ప్రకటించనున్నారు.
కాగా బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం షూటింగు నిన్న హైదరాబాదులో మొదలైంది. పరుచూరి మురళి డైరెక్షన్లో శ్రీకీర్తి కంబైన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మూడో షెడ్యులు ఇప్పుడు జరుగుతోంది. తొలి షెడ్యులు షూటింగు విశాఖలోనూ, రెండో షెడ్యులు హైదరాబాదులోనూ చేసిన సంగతి తెలిసిందే. ఓ వారం రోజులు హైదరాబాదులో షూటింగు చేసిన తర్వాత, యూనిట్ కర్నూలు పట్టణానికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ సుమారు నెల రోజుల షెడ్యులు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ ఇందులో మూడు పాత్రలు పోషిస్తుండగా, ఆయన సరసన లక్ష్మీరాయ్, సలోనీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతికి దీనిని రిలీజ్ చేయడానికి నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











