సీబీఐ...బాలయ్య....అసలేం జరుగుతోంది?

ఈ చిత్రంలో బాలయ్య సీబీఐ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈస్ట్ గోదావరి జిల్లాలో జరుగుతోంది. ఇందులో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని, బాలయ్య అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈచిత్రంలో ఉంటాయని అంటున్నారు.
బాలయ్య సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆర్.రమణరావు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాత్కాలికంగ్ ఈ చిత్రాన్ని 'గాడ్సే' అనే టైటిల్‌తో పిలుస్తున్నప్పటికీ టైటిల్ మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన 'గాడ్సే' పేరును బాలయ్య సినిమాకు పరిశీలిస్తుండటం అభిమానులను కలవర పెడుతోంది. ప్రస్తుతం రాజకీయంగా ఎదుగుతున్న బాలయ్యకు ఇలాంటి నెగెటివ్ టైటిల్ సూటు కాదని, దీని వల్ల ఆయన రాజకీయంగా నష్టం జరుగుతుందని అభిప్రాయ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











