For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శ్రీదేవిని అక్కడ కొట్టి నాన్నగారు నేర్పించారు.. సిల్క్‌స్మిత, మాధురీ దీక్షిత్‌పై బాలకృష్ణ కామెంట్లు వైరల్

  |

  టాలీవుడ్‌లో అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకొన్న ఆదిత్య 369 చిత్రం ఇటీవల 30 సంవత్సరాలు పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రంలోని మధురానుభూతులను బాలకృష్ణ పలు మీడియా ఛానెల్స్‌తో పంచుకొన్నారు. ఆ చిత్ర నిర్మాణ సమయంలో ఎదురైన సమస్యలను, నటీనటులు ప్రతిభను గురించి ఆయన వివరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ చెప్పిన విషయాలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే...

  సిల్క్ స్మిత గురించి బాలయ్య

  సిల్క్ స్మిత గురించి బాలయ్య

  ఆదిత్య 369 సినిమాకు ముందు సిల్క్ స్మితకు ఉన్న ఇమేజ్ వేరు. ఆ సినిమాతో ఆమె నటిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆర్టిస్ట్ అనే వాళ్లు అవకాశం లభిస్తే.. చెలరేగిపోతారని సిల్క్ స్మిత నిరూపించారు. సింహనందిని పాత్రలో అద్బుతంగా ఒదిగిపోయారు. సిల్క్ స్మిత డ్యాన్సరే కావొచ్చు. కానీ ఆమె వేసుకొనే క్యాస్టూమ్స్, మేకప్ గురించి టాప్ హీరోయిన్లు ఆరా తీసేవారు. శ్రీదేవి లాంటి వాళ్లు కూడా ఆమె మేకప్, దుస్తులను అనుకరించే వాళ్లు అని బాలకృష్ణ చెప్పారు.

  రాజ్ కుంద్రాతో కలిసి అందాలు ఆరబోసిన శిల్పా శెట్టి.. ఎక్కడా తగ్గలేదుగా!

  హీరోయిన్ మోహిని గురించి

  హీరోయిన్ మోహిని గురించి

  ఆదిత్య 369 సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్‌లో హీరోయిన్ మోహిని పుస్తకాలు చదువుకొంటూ కూర్చేనిది. నవలలు చదువుతున్నావా అంటే.. స్కూల్‌లో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని చెప్పింది. ఆ సమయంలో తాను తొమ్మిదో క్లాస్ చదువుతున్నదని హీరోయిన్ మోహిని చెప్పింది. దాంతో ఎన్నిసార్లు తొమ్మిదో తరగతి చదివావు అమ్మా అంటూ ప్రశ్నించానని అని బాలకృష్ణ చెప్పారు.

  కాలి గోటికి సరిరాదు.. చెప్పుతో సమానం.. బాలకృష్ణ మరోసారి సంచలన వ్యాఖ్యలు

  డ్యాన్సర్లను చూసి దించేయాలి

  డ్యాన్సర్లను చూసి దించేయాలి

  ఆదిత్య 369 లాంటి సినిమాల్లో నటించేటప్పుడు పాత్రల్లోకి వెళ్లిపోవాలి. సెట్స్‌లో పాటల షూటింగ్ జరుగుతున్నప్పుడు మనతో పనిచేసే డ్యాన్సర్లను పరిశీలించాలి. వారిలో ఎవరైనా బాగా చేస్తున్నారనిపిస్తే మనం ఆ మూమెంట్స్‌ను క్యాచ్ చేయాలి. అలా దించేస్తే ఇక దాని వల్ల వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదు. చాలా మంది కోరియోగ్రాఫర్లను దించేస్తుండటం సహజంగా జరిగేదే అని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు.

  స్కీన్ షోతో హంసా నందినీ: తడిచిన అందాలతో కాక రేపుతోన్న టాలీవుడ్ బ్యూటీ

  శ్రీదేవీ, మాధురీ దీక్షిత్ గొప్ప డ్యాన్సర్లా?

  శ్రీదేవీ, మాధురీ దీక్షిత్ గొప్ప డ్యాన్సర్లా?

  గొప్ప డ్యాన్సర్లు అనుకొనే శ్రీదేవి, మాధురీ దీక్షిత్ కూడా అదే చేశారు. డ్యాన్సర్లను చూసి ప్రతీ ఒక్కరు నేర్చుకోవాల్సిందే. శ్రీదేవి, మాధురీ దీక్షిత్ ఏం చేశారు? కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ చూసి ఆమె స్టెప్పులను దించేశారు. శ్రీదేవి లాంటి నటీనటులకు నాన్నగారు (స్వర్గీయ రామారావు) కాళ్లు తొక్కి డ్యాన్స్, యాక్టింగ్ నేర్పించారు.

  వీపు గుద్దు గుద్ది. నడుముపై, పిర్రలపై గుద్దు గుద్ది నాన్నగారు నేర్పించారు. వాళ్లు చాలా నాజుకుగా డ్యాన్స్ చేసేవారు. కానీ నాన్న గారు చాలా రఫ్ కదా.. వాళ్ల కాళ్లు తొక్కి డ్యాన్స్ నేర్పించారు అని బాలకృష్ణ అన్నారు.

  Akhanda జోరు, సౌతిండియా హీరోల్లో బాలయ్య దే పైచేయి | Nandamuri Balakrishna || Filmibeat Telugu
  స్థాయి కోసం పాకులాడను అంటూ

  స్థాయి కోసం పాకులాడను అంటూ


  సినీ పరిశ్రమలో స్థాయి అంటూ ఏదో ఊహల్లో ఉండకూడకూడదు. నా స్టేటస్ ఇది అనుకొంటే వారి పని ఖతమే. స్థాయి అనేది మనం పడే కష్టం. చేసే పనుల వస్తుంది. అంతేకానీ ఎవరో ఏదో ఇస్తే అది స్థాయి కాదు అనే విధంగా బాలకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్టేటస్ కోసం ఎప్పుడూ తాను పాకులాడను అంటూ ఆయన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

  English summary
  Bala krishna's Aditya 369 movie completed 30 years recenlty. In this occassion, Balakrishna recollected his memories with the movie. He made sensational comments about Bharata Ratna to NTR and, Sridevi, Madhuri Dixit and Silk Smitha
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X