For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Unstoppable with NBK: బ్రహ్మానందంపై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. తల దించుకుని బాధపడ్డ కమెడియన్

  |

  పది కాదు.. ఇరవై కాదు.. దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో పలు రకాల పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆరు పదుల వయసులోనూ ఎంతో ఎనర్జీతో కనిపించడమే కాదు.. ఉత్సాహంగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో ఇటీవలే బాలయ్య.. ఆహా సంస్థ కోసం 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' అనే షోతో హోస్టుగా పరిచయం అయ్యారు. ఆరంభంలోనే సక్సెస్‌ను అందుకున్న ఈ షో.. రెండు ఎపిసోడ్లకే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా మూడో ఎపిసోడ్ ప్రోమోను వదిలారు. ఇందులో బ్రహ్మానందంపై సీరియస్ అయ్యారు. ఆ వివరాలు మీకోసం!

  ‘అఖండ'గా రాబోతున్న బాలకృష్ణ

  ‘అఖండ'గా రాబోతున్న బాలకృష్ణ

  నటసింహా నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన చిత్రమే 'అఖండ'. దీన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ ఇందులో హీరోయిన్‌. పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తోంది. శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. థమన్ దీనికి సంగీతం అందించాడు. ఇది డిసెంబర్ 2 విడుదల కానుంది.

  బ్రా కూడా లేని వీడియోతో షాకిచ్చిన పాయల్ రాజ్‌పుత్: ప్రైవేటు పార్టులు చూపిస్తూ దారుణంగా!

  అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే టాక్ షో

  అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే టాక్ షో

  అరవై ఏళ్ల వయసులోనూ నందమూరి బాలకృష్ణ ప్రయోగాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'Unstoppable with NBK' అనే టాక్ షోతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. అల్లు అరవింద్‌కు చెందిన ఆహా సంస్థ దీన్ని రూపొందించింది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ టాక్ షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేశారు.

  రెండు ఎపిసోడ్స్.. అదరగొట్టేశారుగా3

  రెండు ఎపిసోడ్స్.. అదరగొట్టేశారుగా3

  'Unstoppable with NBK' టాక్ షో ఇప్పటికే రెండు ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. మొదటి దానికి మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణులు గెస్టులుగా వచ్చారు. రెండో ఎపిసోడ్‌కు నేచురల్ స్టార్ నాని వచ్చాడు. ఈ రెండింటికీ నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ టాక్‌ షోకు చాలా క్లిక్కులు దక్కడంతో ట్రెండింగ్ అయిపోయింది.

  ప్యాంట్ లేకుండా షాకిచ్చిన అనన్య నాగళ్ల: సినిమాల్లో నిండుగా.. ఇక్కడ మాత్రం అరాచకంగా!

  2 ఎపిసోడ్లకే ఆగిపోయిన ఎన్‌బీకే షో

  2 ఎపిసోడ్లకే ఆగిపోయిన ఎన్‌బీకే షో

  ఆహాలో 'Unstoppable with NBK' టాక్‌ షోను ప్రతి శుక్రవారం స్ట్రీమింగ్ అయ్యేలా ప్లాన్ చేశారు. అలాగే, రెండో ఎపిసోడ్‌ను కూడా రిలీజ్ చేశారు. దీంతో ప్రతి శుక్రవారం ఎపిసోడ్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అది మాత్రం జరగలేదు. ఫలితంగా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో రెండు ఎపిసోడ్లకే ఆగిపోయిందన్న టాక్ ఫిలిం నగర్ ఏరియాలో వినిపించింది.

   ప్రతివారం రాడానికి సీరియల్ కాదు

  ప్రతివారం రాడానికి సీరియల్ కాదు

  కొన్ని అనివార్య కారణాల వల్లే 'Unstoppable with NBK' ఆగిపోయిందని.. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో వస్తామని ఆహా టీమ్ ఇటీవల వెల్లడించింది. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ షోకు సంబంధించిన మూడో ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో 'ప్రతి వారం రావడానికి నేను సీరియల్ కాదు.. సెలబ్రేషన్' అంటూ బాలయ్య పంచ్ డైలాగ్ విసిరారు.

  Janhvi Kapoor: బటన్స్ విప్పేసి రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ముందుకు వంగి మరీ అందాల జాతర

  హాస్యబ్రహ్మ.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌తో

  'Unstoppable with NBK' మూడో ఎపిసోడ్‌కు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్టులుగా వచ్చారు. ఇందులో వాళ్లిద్దరితో కలిసి బాలయ్య తెగ సందడి చేశారు. 'ఎన్ని కష్టాలు వచ్చిన నవ్వడం ఆపొద్దు.. నవ్వించడం ఆపొద్దు' అంటూ డైలాగ్ విసిరిన బాలయ్య.. ఆ తర్వాత వాళ్లిద్దరినీ అనుకరిస్తూ.. పెగ్గులు అంటూ నవ్వులు పూయించారు.

  Recommended Video

  Akhanda Movie టార్గెట్.. | Naga Chaitanya మాస్ లో క్లాస్ ! || Filmibeat Telugu
  బ్రహ్మానందంపై బాలయ్య సీరియస్

  బ్రహ్మానందంపై బాలయ్య సీరియస్

  ప్రోమో చివర్లో బాలయ్య మాట్లాడుతూ 'బ్రహ్మానందం గారు మన సినిమాలో కూడా అనేశాను.. తథాస్తు దేవతలే కదండి' అని ఏదో చెప్పబోయారు. అంతలో బ్రహ్మానందం మధ్యలో మాట్లాడారు. దీంతో బాలయ్య 'మీరు ఆగండి.. డైరెక్టర్‌గా ఆయన స్క్రిప్టు. ఎవడి చేత ఏ పాత్ర వేయించాలో ఆయనకు తెలుసు' అంటూ సీరియస్ అయ్యారు. దీంతో బ్రహ్మానందం తలదించుకున్నారు.

  English summary
  Nandamuri Balakrishna Now Doing Unstoppable with NBK Show For Aha. Balakrishna Serious on Brahmanandam in This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X