Rudrangi: హీరోయిన్లపై బాలయ్య షాకింగ్ కామెంట్స్.. సెక్సీ అంటూ సుమను కూడా.. అందరి ముందే అలా తిట్టడంతో!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా తనదైన టాలెంట్‌తో సుదీర్ఘ కాలంగా స్టార్‌గా హవాను చూపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఆరు పదుల వయసు వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ఆయన.. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా వేరే చిత్రాల కార్యక్రమాల్లో సైతం పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన 'రుద్రంగి' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య హీరోయిన్లు, సుమపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు మీకోసమే!
పిరియాడిక్ మూవీగా రుద్రంగి: విమలా రామన్, మమతా మోహన్‌దాస్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన పిరియాడిక్ యాక్షన్ మూవీనే 'రుద్రంగి'. అజయ్ సామ్రాట్ తెరకెక్కించిన ఈ సినిమాను రసమయి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించారు. ఈ సినిమాకు AIS Nawfalraja సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా జూలై 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్:'రుద్రంగి' మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి నటసింహా నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు మంత్రి హరీష్ రావు కూడా వస్తారని ప్రకటించినా.. ఆయన అనివార్య కారణాల వల్ల హాజరు కాలేదు. ఇక, ఈ ఈవెంట్‌కు ఎంతో మంది జనాలు రావడంతో గ్రాండ్‌గా జరిగింది.

యాంకర్ సుమనే టార్గెట్‌గా: 'రుద్రంగి' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నటసింహా నందమూరి బాలకృష్ణ తనదైన మేనరిజం, స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. మాస్ డైలాగులు, కామెడీ పంచ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగులతో ప్రసంగాన్ని రక్తి కట్టించారు. ముఖ్యంగా యాంకర్ సుమ కనకాలనే టార్గెట్ చేసిన ఆయన.. ఆమెపై ఫన్నీగా సీరియస్ అవడంతో పాటు ఎన్నో సెటైర్లను కూడా వేశారు.
ఏయ్ ఆపు అంటూ సీరియస్: 'రుద్రంగి' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ సుమ.. హీరో జగపతి బాబును మాట్లాడాలని కోరింది. కానీ, ఆయన బాలకృష్ణతో ఏదో మాట్లాడుతూ ఉండడంతో మరోసారి రిక్వెస్ట్ చేసింది. తర్వాత మైకులో జగపతి బాబు గురించి ఎలివేట్ చేస్తుండగా.. బాలయ్య కల్పించుకుని 'ఏయ్ ఆపు.. ఎప్పుడూ లొడలొడా వాగుతూ ఉంటావు' అంటూ ఫన్నీగా సీరియస్ అయ్యారు.

హీరోయిన్లు, సుమపై నాటీగా: ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య మాట్లాడే ముందు అభిమానులు 'కోకా కోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ' అనే నినాదాన్ని వినిపించారు. అప్పుడు ఆయన 'అందరికీ నమస్కారం.. ఉండండయ్యా.. ఇక్కడ సుమ ఉంది. మమతా మోహన్‌దాస్ ఉంది. విమలా రామన్ ఉంది. వీళ్లంతా ఉండగా బాలయ్య బాబు సెక్సీ అంటే జలస్ ఫీల్ అవుతారు' అంటూ చమత్కరించారు.

సుమకు చెంపదెబ్బలంటూ: హీరోయిన్లతో పాటు తన పేరు తీయడంతో సరిగా వినిపించుకోని సుమ ఏమైందని బాలయ్యకు సైగ చేసింది. దీంతో ఆయన పక్కకు పిలిచి మరీ 'వీళ్లంతా నన్ను బాలయ్య బాబు సెక్సీ అంటున్నారు. నువ్వు ఆ హీరోయిన్లు ఎంత ఈర్శ పడతారు అని అంటున్నాను' అని వివరించారు. ఆ తర్వాత 'సుమకు అప్పుడప్పుడు చెంపదెబ్బలు (పంచ్‌లు) అవసరం' అని షాకిచ్చేశారు.
పాపం రాజీవ్ కనకాల అని: ఆ తర్వాత సుమను ఉద్దేశించి 'ఈవిడతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనల్నే చెప్పుదెబ్బలు కొడుతుంది. పాపం ఆ రాజీవ్ కనకాల ఎలా భరిస్తున్నాడో' అంటూ బాలయ్య ర్యాగింగ్ చేశారు. తర్వాత జగపతి బాబు మైక్ తీసుకుని 'సుమకు 28 డేట్స్ లేవు అంటే నీకోసం ఆయన 29న రావడానికి ఒప్పుకున్నారు' అని చెప్పాడు. మొత్తానికి బాలయ్య - సుమ ఎపిసోడ్ అందరినీ నవ్వించిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











