For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏపీ సర్కార్ కన్‌ఫ్యూజన్‌లో.. ‘మా‘ భవనం ఎందుకు కట్టలేదు.. బాలకృష్ణ వ్యాఖ్యల పెను దుమారం!

  |

  అత్యంత వివాదాస్పదమవుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారంపై నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. ఇప్పటి వరకు మా సంఘానికి పెద్దలుగా వ్యవహరించిన వాళ్లు ఏం చేశారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గత నెల రోజులుగా సినీ వర్గాల్లో చోటు చేసుకొన్న సంఘటనలపై తనదైన శైలిలో స్పందించారు. మా ఎన్నికల వివాదంపై బాలకృష్ణ స్పందిస్తూ..

  ఏపీ సర్కారు నిర్ణయంలో

  ఏపీ సర్కారు నిర్ణయంలో

  అఖండ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి అవుతుంది. దసరాకు రిలీజ్ చేయాలా? వద్దా? అనే విషయంపై ఇంకా నిర్ణయించుకోలేదు. ఏపీ ప్రభుత్వం కన్‌ఫ్యూజషన్‌లో ఉంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి కొంత క్లారిటీ వచ్చింది. థియేటర్ల టికెట్ రేట్ల పెంపు, అక్యుపెన్సీ విషయం గురించి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. రేట్లు తగ్గాయనే విషయంలో వివాదం కొనసాగుతున్నది. 20, 30 రూపాయల టికెట్లు పెడితే లాభాలు వస్తాయా? ఓవరల్‌గా ఇండస్ట్రీ బాగుండాలి అని బాలకృష్ణ అన్నారు.

  చిన్న నిర్మాతలు సమస్యల్లో

  చిన్న నిర్మాతలు సమస్యల్లో

  ఏ పార్టీ అయినా అందులోని నాయకులందరూ స్వర్గీయ ఎన్టీఆర్ అభిమానులే. వారితో మాట్లాడటానికి నాకేమి భయం. తక్కువ రేటు టికెట్ పెడితే గిట్టుబాటు అవుతుందా? ఇండస్ట్రీ ఇలా అయితే బాగుపడదు. బయ్యర్స్ బాగుండాలి.. పవర్ టారిఫ్, మెయింటెన్స్ ఖర్చులు పోవాలి. జీవో ఇటీవలే రిలీజ్ చేశారు. కానీ వాటి వల్ల సినీ పరిశ్రమకు లాభం లేదు. ముఖ్యంగా చిన్న సినిమాలు సమస్యల్లో కూరుకుపోతున్నాయి. అవి బయటపడితే బాగుంటుంది. పెద్ద హీరో సినిమాలు థియేటర్లలోనే చూడటానికి ప్రేక్షకులు వస్తారు. చిన్న సినిమా నిర్మాతలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. నిర్మాతల మండలి తగిన నిర్ణయం తీసుకోవాలి అని బాలకృష్ణ పేర్కొన్నారు.

  తలా తోకా లేని బీ ఫారమ్ రిలీజ్

  తలా తోకా లేని బీ ఫారమ్ రిలీజ్

  ఓటీటీలో రిలీజ్ చేయని తప్పని పరిస్థితి నిర్మాతలకు ఉంది. ఆ ప్రభుత్వం బీ ఫారమ్ రిలీజ్ చేసింది. దానికి తలాతోకా లేదు. ఇండస్ట్రీ వర్గాలకు అర్ధం కావడం లేదు. ఆ షరతులేంటో ఎవడికి అర్ధం కావడం లేదు. కాలికి వేస్తే వేలికి వేస్తున్నారు అంటూ బాలకృష్ణ ఎద్దేవా చేశారు. ప్రభుత్వాలు సహకరించి తగిన నిర్ణయం తీసుకొంటే సినిమా పరిశ్రమ బాగుపడుతుంది అని బాలకృష్ణ చెప్పారు.

  మా బిల్లింగ్ ఎందుకు కట్టలేకపోయారు?

  మా బిల్లింగ్ ఎందుకు కట్టలేకపోయారు?


  మా ఎన్నికలపై నేనేమి మాట్లాడను. ఆ విషయంపై నేను స్పందించలేను. లోకల్, నాన్ లోకల్ అనే విషయాన్ని పట్టించుకోవద్దు. మా ఎన్నికల వేళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న వారు మా సంఘానికి సంబంధించిన బిల్డింగ్ ఎందుకు కట్టలేదని ప్రశ్నిస్తున్నాను. ఎవరు పోటీ చేసినా నాకు అభ్యంతరం లేదు. కానీ భవనాన్ని ఎందుకు కట్టలేదనేది నా ప్రశ్న. తలచుకొంటే ఇంధ్రభవనం కొట్టొచ్చు. ఇలాంటి చిల్లర వ్యవహారాలను పెట్టించుకోను. నాకు చాలా విషయాలను పరిష్కరించాలన్న బాధ్యత ఉంది అని బాలకృష్ణ అన్నారు.

  మా భవనానికి నేను సహకరిస్తా

  మా భవనానికి నేను సహకరిస్తా

  ప్రభుత్వాలతో సినీ పెద్దలు రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగితే మా భవనం కోసం భూమి ఇవ్వదా? నిధుల సేకరణ కోసం విదేశాలకు బిజినెస్ క్లాసుల్లో వెళ్లి విలాసాలను అనుభవించారు. అవన్నీ మాట్లాడితే ఇబ్బంది కలుగుతుంది. ఒకవేళ మంచు విష్ణు కుటుంబం భవనానికి ముందుకు వస్తే నేను సహకరిస్తాను. ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్ నిర్వహించడానికి లలిత కళాతోరణం నిర్మించాలని ప్లాన్ చేస్తే.. జరగదని అన్నారు. కానీ ఎన్టీఆర్ స్వయంగా తట్టా నెత్తిన పెట్టుకొని పనిచేశారు. దాంతో ఫిలింఫెస్టివల్‌ను సక్సెస్‌పుల్‌గా నిర్వహించారు అని బాలకృష్ణ తెలిపారు.

  MAA Election : Jeevita Rajasekhar Vs Prakash Raj Vs Manchu Vishnu| Triangular Fight|Filmibeat Telugu
  సినీ పెద్దల మౌనంపై రకరకాలుగా..

  సినీ పెద్దల మౌనంపై రకరకాలుగా..

  ఆదిత్య 369 30 ఏళ్లు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో బాలకృష్ణ పలు టెలివిజన్ ఛానెల్స్‌తో మాట్లాడుతూ ఘాటుగా స్పందించారు. అయితే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎవరూ నోరు విప్పకపోవడం కూడా చర్చనీయాంశమవుతున్నది. అయితే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎవరూ ఎందుకు నోరు విప్పడం లేదు? భవనం నిర్మాణం ఆలస్యం ఎందుకైంది అని కొందరు సినీ ప్రముఖులు కూడా లోలోపల చర్చించుకొంటున్నారు. ఎవరైనా స్పందిస్తే.. ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు.

  English summary
  Balakrishna has rises Sharp questions on MAA Building Construction and MAA Elections. He spoke to media channels on eve of 30 years of Adithya 369. He criticises for delay of MAA Building construction.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X