»   » అమ్మాయికి ముద్దు పెట్టాలి లేదా కడుపు చేయాలి: బాలయ్య షాకింగ్ కామెంట్స్!

అమ్మాయికి ముద్దు పెట్టాలి లేదా కడుపు చేయాలి: బాలయ్య షాకింగ్ కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నారా రోహిత్ నటించిన 'సావిత్రి' మూవీ ఆడియో వేడుకలో బాలయ్య చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. బాలయ్య సమయానుభావంగా స్పందిస్తారు...హాస్యాన్ని పండిస్తారు, చిలిపి చేష్టలు చేసే సమయంలో చిలిపి గా ప్రవర్తిస్తుంటారు అనే పేరు ఉంది. సావిత్రి ఆడియో వేడుకలో బాలయ్య అవన్నీ ప్రదర్శించారు.

అందరూ అన్ని రకాల పాత్రలు చేయలేరు....నేను కొన్ని పాత్రలు మాత్రమే చేయగలను, అమ్మాయిల వెంట పడే పాత్రలు చేస్తే మా ఫ్యాన్స్ ఊరుకోరు. అమ్మాయికి ముద్దు అయినా పెట్టాలి... కడుపైనా చేయాలి, కమిట్ కమిట్ అంటూ వెళ్లి పోవాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు బాలయ్య.

Balakrishna

'నారా రోహిత్ గురించి నందిత మాట్లాడుతూ చాలా కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అని చెప్పింది... అపుడు నేను కింద నుండి అరుస్తూనే ఉన్నాను. నేను మాత్రం చాలా నాటీ. రోహిత్ కు కొన్ని మా పోలికలు కూడా రావాలి...ఆ గిల్లడాలు, ఆ పొడవడాలు. నేను ఎక్కని ఎత్తు లేవు, నేను చూడని లోతులు లేవు' అంటూ బాలయ్య చెప్పడంతో ఆడియో వేడుక అంతా ఫ్యాన్స్ ఈలలు గోలతో దద్దరిల్లింది.

నారారోహిత్ హీరోగా, నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం 'సావిత్రి'. ఈ చిత్రాన్ని ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్ పవన్ సాదినేని దర్శకత్వంలో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రవణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెక్షన్ సెంటర్ లో జరిగింది

English summary
Balakrishna shocking speech at Savithri Audio Launch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu