బాలయ్య కాల్పుల గొడవ మళ్ళీ

ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును అంతగా పట్టించుకోకపోవడం, ఈ కేసులో బాధితులు బెల్లంకొండ సురేష్, సత్యనారాయణ చౌదరి న్యాయ స్థానంలో ఎవరు కాల్పులు జరిపారో తెలియదని వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసు అప్పట్లో నీరుగారి పోయింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఈ కేసును మరోసారి విచారించేందుకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ బి.ప్రసాదరావు చెప్పారు. అయితే ఈ విషయంపై బాలకృష్ణ మాట్లాడుతూ న్యాయపరమైన అంశాల్లో చట్టం తనపని తాను చేసుకు పోతుందని వ్యాఖ్యానించారు. తనపై ఉన్న కేసును దిగువ కోర్టులు కొట్టి వేశాయని, హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు తనకు తెలియదన్నారు. అయితే ప్రజల్లో ఈ కేసు విషయమై రకరకాల కామెంట్స్ ప్రజల్లో నానుతున్నాయి. వీటిల్లో ఏది నిజం అని ఈ ఛానెల్ వారు నిరూపించనున్నారో..వారు చేసిన ప్రత్యేకమైన ఇన్విస్టిగేషన్ ఏమిటన్నది అందరిలో ఆసక్తి రేపుతోంది.


Click it and Unblock the Notifications











