twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ 'సింహా' చిత్రానికి 'ఎ ' సర్టిఫికేట్

    By Srikanya
    |

    బాలకృష్ణ, బోయపాటి శ్రీను ల కాంబినేషన్లో రెడీ అయిన 'సింహా' చిత్రానికి సెన్సార్ వారు 'ఎ' సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ నెల 30వ తేదీన రిలీజవుతున్న ఈ చిత్రం మార్కెట్లో విపరీతమైన హైప్ క్రియేట్ చేసుకుంది. అందులోనూ వరస ఫ్లాఫ్ లలో ఉన్న బాలయ్యకి ఈ చిత్రం మళ్ళీ హిట్ ల బాటలోకి తీసుకువెళ్థుందని బావిస్తున్నారు. మరో ప్రక్క బోయపాటి గత రెండు చిత్రాలు భద్ర, తులసి మంచి విజయం సాధించటం కూడా ఈ నమ్మకానికి తోడయింది. అలాగే ఈ చిత్రంలో నయనతార, నమిత, స్నేహా ఉల్లాల్ తమ అంద చందాలతో అలరించనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్, పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

    దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ...పౌరుషం నిండిన పాత్రల్ని పోషించడంలో బాలకృష్ణ శైలి వేరు. ఆయన ఈ చిత్రంలో పోషించిన పాత్ర, నటన తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తాయన్నారు. కె.ఆర్‌.విజయ, కోట శ్రీనివాసరావు, సాయికుమార్‌, కిన్నెర, సుధ, ఝాన్సీ, అలీ, కృష్ణభగవాన్‌, శ్రావణ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న మిత్రుడు అనంతరం బాలకృష్ణ చేస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X