78 ఏళ్ళ చరిత్రను తిరగరాసిన 'సింహా'
78 ఏళ్ళ తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగరాసి అత్యధిక కేంద్రాల్లో మంచి కలెక్షన్లతో 'సింహా' ప్రదర్శితమవుతోంది. మా సినిమా అన్ని కేంద్రాల్లో అత్యధిక విజయాన్ని నమోదు చేసుకుంది. ఇంతటి ఘన విజయాన్ని మా సంస్థకు అందించిన బాలకృష్ణగారికి, బోయపాటి శ్రీనుకు పనిచేసిన బృందానికి శతదినోత్సవం సందర్భంగా మా అభినందనలను తెలియజేస్తున్నాం అని నిర్మాత పరుచూరి కిరీటి అన్నారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మించిన చిత్రం 'సింహా'. 'సింహా' విడుదలై 100 రోజులు చేసుకుంది. ఈ సందర్బంగా ఇలా స్పందించారు.
ఇక దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ "బాలయ్య బాబుతో 'సింహా'లాంటి సెన్సేషనల్ హిట్ వచ్చినందుకు చాలా ఆనందంగాఉంది. అందరికీ ధన్యవాదాలు" అని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత బి.మహేంద్రబాబు మాట్లాడుతూ "శతదినోత్సవం జరుపుకుంటున్న 'సింహా'లాంటి పెద్ద హిట్ మా సంస్థలో రావడం మా యూనిట్ అందరికీ గర్వకారణం" అని తెలిపారు. చాలా గ్యాప్ తర్వాత బాలకృష్ణ కొట్టిన హిట్టు ఈ చిత్రం. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నమిత, స్నేహా ఉల్లాల్, నయతార నటించారు. ప్రస్తుతం బాలయ్య..దాసరి దర్శకత్వంలో రూపొందుతున్న పరమవీర చక్ర చిత్రం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











