'సింహా' పోరాటం
యాక్షన్, మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా 'యువరత్న బాలకృష్ణ' ని చెప్పవచ్చు. ఇటీవల 'మిత్రుడు'గా సాఫ్ట్ రోల్ తో ప్రేక్షకులముందుకు వచ్చిన బాలయ్య మరో సారి 'సింహా'గా పూర్తి యాక్షన్ మూవీతో ప్రేక్షకులను అలరించనున్నాడు. 'భద్ర', 'తులసి' లాంటి యాక్షన్ సినిమాలను తీసిన బోయపాటి శ్రీను ఈ చిత్రనికి దర్శకత్వం వహిస్తున్నాడు. నమిత, స్నేహా ఉల్లాల్ కథానాయికలుగా నటిస్తున్నారు.
యునైటెడ్ మూవీస్ పతాకం పై పరుచూరి కిరీటి ఈ చిత్రన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ, మలయాళ నటుడు సాయికుమార్, రమేష్, సైరాబాను తదితరుల పై ఫైట్ మాస్టర్ స్టన్ శివ నేతృత్వంలో ఇంట్రడక్షన్ ఫైట్ ను చిత్రీకరిస్తున్నారు. నేటి నుండీ హీరో హౌస్ సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. బాలకృష్ణ, స్నేహ ఉల్లాల్, కె.ఆర్.విజయ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణ భగవాన్ తదితరులపై వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఈ చిత్రం ద్వారా బాలకృష్ణ చిత్రానికి చక్రి మొదటి సారి సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











